ఈ వారం యూట్యూబ్ హిట్స్ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, May 17 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ప్రెట్టీ గాళ్స్
4 ని. 32 సె. హిట్స్ 1,22,68,900

బ్రిట్నీస్పియర్స్, ఇగ్గీ అసేలియాల మధ్య ‘క్యాంపీ’ ఫన్ ఇది. క్యాంపీ అంటే స్ట్రేంజ్ అండ్ షాకింగ్. ఇద్దరూ 80ల లుక్‌తో కనిపిస్తారు. బ్రిట్నీ పింక్ డ్రెస్‌లో ఉంటుంది. ఈతకొలను పక్కన కూర్చుని ఉన్నప్పుడు ఇగ్గీ ఏలియన్‌లా  ఊడిపడుతుంది. ఇద్దరు డాన్స్ చేస్తారు. పాడతారు. 1988 నాటి హాలీవుడ్ మూవీ ‘ఎర్త్ గర్ల్స్ ఆర్ ఈజీ’ ఇన్‌స్పిరేషన్‌తో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూత్‌ని ఉర్రూతలూగిస్తోంది.
 
సూపర్ గర్ల్ - ఫస్ట్ లుక్ ట్రైలర్
6 ని. 36 సె. హిట్స్: 81,81,445
పక్షి కాదు. విమానం కాదు. ఇట్స్ ఎ సూపర్‌గర్ల్. డీసీ కామిక్స్ కొత్త క్యారెక్టర్. సూపర్‌మేన్ కజిన్ సిస్టర్. ‘‘నా కజిన్ బ్రదర్ కల్ ఎల్ భూమి అనే గ్రహం మీదికి వెళ్లాడు. అతడి స్టోరీ గురించి మీకు తెలుసు. ఇప్పుడు నేనూ భూమ్మీదికి వస్తున్నాను. నా పేరు కారా జోర్ ఎల్’’ అని చెబుతుంది ఈ అమ్మాయి. అమెరికన్ సీబిఎస్ టెలివిజన్ నెట్ వర్క్ సమర్పించిన ఈ సపర్ గర్ల్ ఫస్ట్ లుక్ ట్రైలర్‌ను ప్రతి అమ్మాయీ చూసి తీరాలి.
 
హమారీ అధూరీ కహానీ టైటిల్ సాంగ్
2 ని. 14 సె. హిట్స్: 17,82,899
హమారీ అధూరి కహానీ టైటిల్ ట్రాక్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్ మధ్య సాంగ్ ఇది. గానం అరిజిత్ సింగ్. రొమాంటిక్ సెలైన్స్ సీక్వెన్స్. మోహిత్ సూరీ డెరైక్ట్ చేశారు. మ్యూజిక్ కంపోజ్ చేసింది కోల్‌కతా బాయ్ జీత్ గంగూలి. రంగ్ థే, నూర్ థా / జబ్ కరీబ్ తూ థా / ఏక్ జెన్నత్ పా థా, ఏ జహా / వక్త్ కి రేత్ పె కుచ్ మెరే నామ్ సా / లిఖ్ కె ఛోడ్ గయా తు కహా పాటల మిక్సింగ్ ఇది. సినిమా జూన్ 12న రిలీజ్ అవుతోంది.
 
తనిష్క్ హ్యాపీ మదర్స్ డే యాడ్
1ని. 46 సె. హిట్స్ : 6, 94,400
హ్యాపీ మదర్స్‌డేకి దీపికా పడుకోనే చేత తనిష్క్ చేయించిన యాడ్ ఇది. దీపిక ఒక జ్యూయలరీ షాపులో తన తల్లికి ఇవ్వడం కోసం గిఫ్ట్‌ను సెలెక్ట్ చేస్తుంటుంది. సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా అమ్మకు కూతుర్నే అని చెబుతుంది. యాడ్ చివర్లో తల్లికి గిఫ్ట్ ఇస్తూ, ఆమెను కావిలించుకుని దీపిక ఎమోషన్‌తో బర్ట్స్ అవడం హృదయాన్ని కదలిస్తుంది. ‘‘ఆజ్ భీ తుమ్హారే
 సామ్నే ఖానే కె ప్లేట్ మే కుఛ్ ఛోడ్‌నే కి హిమ్మత్ నహీ హోతీ’ అని యాడ్ మధ్యలో దీపిక చెప్పడం టచింగ్‌గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement