ముల్క్ – ట్రైలర్
నిడివి 2ని. 40సె ,హిట్స్ 1,15,86,943
పరువు, మర్యాదలే ఆస్తిగా ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబం జీవనం సాగిస్తోంది. హఠాత్తుగా దేశ ద్రోహులు అనే ఆరోపణలు వారిని వెంబడించాయి. ఇరుగుపొరుగు వారు మాటలతోనే హింసిస్తున్నారు. దీనికి తోడు మీడియా వారిని హైలైట్ చేస్తోంది. ఆ కుటుంబానికి ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఓ హిందూ లాయర్ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ఆల్మోస్ట్ ఇటువంటి అంశాలతోనే హిందీలో రూపొందిన చిత్రం ‘ముల్క్’. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణా, రాజత్ కపూర్ నటించారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ ట్రైలర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. సినిమాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్లిం కుటుంబం పెద్దగా రిషీ కపూర్ నటించారు. గడ్డం పెంచుకున్న ప్రతీ ముస్లిం ఉగ్రవాది కాదు అంటూ ట్రైలర్‌లో వినిపించే సంభాషణలు ఉద్వేగభరితంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో అశుతోష్ రాణా, డిఫెన్స్ లాయర్ పాత్రలో తాప్సీ నటించారు. ఓ న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను డెవలప్ చేశారట దర్శకుడు అనుభవ్ సింగ్. ‘ముల్క్’ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకేం ఇంకేం కావాలే – లిరికల్ వీడియో
నిడివి 4ని. 29సె. ,హిట్స్ 70,08,912
‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ‘యువత, సోలో’ వంటి చిత్రాలను రూపొందించిన పరుశురామ్‌తో విజయ్ ఓ ప్రేమకథా చిత్రంతో వస్తుండటంతో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం కావాలే’ లిరికల్ వీడియోను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.
చిన్న మనస్పర్థ వల్ల విడిపోయిన హీరో హీరోయిన్ మళ్లీ కలుసుకున్న సందర్భంలో వచ్చే పాట ఇది. గోపీ సుందర్ అందించిన క్యాచీ ట్యూన్‌కు అనంత్ శ్రీరామ్ అందించిన అద్భుతమైన లిరిక్స్, సిడ్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ తోడు అవ్వడం ఈ పాటకు పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాధించిందంటే ఈ పాట యూత్‌లోకి ఎంత బాగా వెళ్లిందో చెప్పొచ్చు.
96 – టీజర్
నిడివి 1 ని. 21 సె. ,హిట్స్ 30,28,130
మన లైఫ్‌లో పెద్ద పెద్ద మార్పులు జరగడానికి చిన్న ప్రయాణాలు కూడా చాలు అంటారు. తమిళ చిత్రం ‘96’ టీజర్ చూస్తే అదే అనిపిస్తోంది. విజయ్ సేతుపతి, త్రిష కలసి నటిస్తోన్న చిత్రం ‘96’. అస్తవ్యస్తంగా ఉన్న విజయ్ సేతుపతి జీవితంలోకి త్రిష ప్రవేశించి ఎలాంటి మార్పులు తీసుకొచ్చారని టీజర్ చెబుతోంది. కథంతా 96 గంటల్లో జరుగుతుందనే అనుమానం కూడా రాక మానదు, టైటిల్, టీజర్‌ను గమనిస్తే.
సుమారు 80 సెకన్ల టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం ,చాలా గ్యాప్ తర్వాత కనిపిస్తున్న త్రిష పదేళ్లు వెనక్కి వెళ్లినంత అందంగా కనిపించడం టీజర్‌లో విశేషాలు. వైవిధ్యం చూపించడంలో విజయ్ సేతుపతి నిరాశపరచలేదు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన దర్శకుడు ప్రేమ్ సి. కుమార్ స్క్రీన్ అంతా కలర్‌ఫుల్‌గా ఉండేట్టుగా చూసుకున్నారు. కథేంటి అనేది చెప్పకపోయిన ఓ అందమైన జర్నీని ఈ సినిమాలో మీరు చూడొచ్చు అనేలా ఉందీ టీజర్.
Comments
Please login to add a commentAdd a comment