శైలజా రెడ్డి అల్లుడు – ట్రైలర్
నిడివి 1 ని. 48 సె. ,హిట్స్ 45,51,713
మనం ప్రతిరోజూ చూసే సాధారణ సమస్యలే దర్శకుడు మారుతికి కథా వస్తువులుగా కనిపిస్తున్నాయి ఈ మధ్య. భలే భలే మగాడివోయిలో ‘మతి మరపు’ను, మహానుభావుడులో ‘ఓసీడీ’ను పాయింట్‌గా చేసుకొని సక్సెస్ సాధించారు. అయితే ఈసారి అక్కినేని హీరో నాగ చైతన్యతో కలసి ‘శైలజా రెడ్డి అల్లుడు’గా రాబోతున్నాడు. ఈ సినిమా కోసం ‘ఈగో’ అనే పాయింట్‌ను టచ్ చేసినట్టున్నారు మారుతి. తను ప్రేమించే అనూ ఇమ్మాన్యుయేల్, అత్తగారు రమ్యకృష్ణగార్ల ఈగోకు బలైపోయే అల్లరి పిల్లాడిగా చైతన్య కనిపించేట్లుగా ట్రైలర్‌లో చూపించారు. అలాగే మారుతి మార్క్ కామెడీతో ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోయింది. ట్రైలర్‌ను బట్టి అంచనా వేస్తే 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ హైలైట్‌గా ఉండబోతోందని ఊహించవచ్చు. నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘అల్లరి అల్లుడు’ ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. వినాయక చవితి స్పెషల్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
భైరవ గీత – ట్రైలర్
నిడివి 1 ని. 59 సె. ,హిట్స్ 5, 82, 062
రామ్‌గోపాల్ వర్మ తీసే సినిమాల్లాగే ఆయన ప్రెజెంట్ చేసే సినిమాలు కూడా చాలా బోల్డ్‌గా, మరీ ముఖ్యంగా రియలిస్టిక్‌గా ఉంటాయి. కన్నడ దర్శకుడు సిద్ధార్థ్ తెర కెక్కించిన హైవోల్టేజ్ రూరల్ లవ్‌స్టోరీ ‘భైరవ గీత’. ఈ కన్నడ సినిమాను తెలుగు ఆడియన్స్‌కు ఆర్జీవీ సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మధ్య ఆడియన్స్ టేస్ట్ కూడా కొంచెం హానెస్ట్, రియలిస్టిక్ కథలు ఉంటేనే థియేటర్స్ వైపు అడుగులేస్తున్నారు. ఆల్రెడీ అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్100 సినిమా ప్రూవ్ చేశాయి. అన్నీ అలా ఉంటాయి అనుకోవడం కూడా పొరపాటే. విలేజ్ రివెంజ్ డ్రామాను చూపించింది ట్రైలర్. పేద, ధనిక, కుల మత వ్యత్యాసాలన్నింటిని కనబరిచే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఉండబోతోందనే అవగాహన
మాత్రం కలిగించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న సమస్యలు, దానికోసం పెద్ద వాళ్లపై చేసే తిరుగుబాటు చుట్టూ కథను అల్లుకున్నట్టున్నాడు దర్శకుడు. అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది.
సీమరాజా – ట్రైలర్
నిడివి 1 ని. 56 సె. ,హిట్స్ 20,24,249
అన్ని సమయాల్లో అన్ని రకాల కథలను ఎంజాయ్ చేసినా పండక్కి మాత్రం కచ్చితంగా ఓ పక్కా ఫార్ములా మాస్ సినిమా కోరుకుంటాడు ప్రేక్షకుడు. అదో మజా. తమిళ చిత్రం ‘సీమరాజా’ కూడా పండగకి వచ్చే మాస్ సినిమా ఫీలింగ్‌ని కలిగిస్తోంది. పక్కా విందు భోజనంలా తయారు చేసినట్టున్నాడు దర్శకుడు పోన్రమ్. అంచెలంచెలుగా స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి మాస్ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న శివకార్తికేయన్ ఇందులో కథానాయకుడు. సమంత హీరోయిన్. ఊర్లో జరిగే హీరో విలన్ సవాల్‌గా ఈ సినిమా ఉండబోతోంది అని ట్రైలర్ చెవులు పగిలిపోయేలా చెబుతోంది. హీరోయిన్‌గా ఇంతకాలం ఆకట్టుకున్న సిమ్రాన్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. సిమ్రాన్ మాస్ డైలాగ్స్ పలకడం కొంచెం కొత్తగానే ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో ఈ సినిమా పండక్కి నడుస్తోంది అనే ఫీలింగ్‌ని కలగజేస్తుంది. వినాయక చవితికి రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment