
దుమ్మురేపుతున్న 'ధృవ' టీజర్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం 'ధృవ' టీజర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. దసరా కానుకగా మంగళవారం విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ ను ఇప్పటి వరకు 30 లక్షల మందిపైగా వీక్షించారు. విడుదలైన 24 గంటల్లోపే ఈ టీజర్ కు 10 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో దీన్ని షేర్ చేశారు. 'నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది.. నా శత్రువును సెలెక్ట్ చేసుకున్నా..' అంటూ రాంచరణ్ చెప్పిన డెలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటోంది.
ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా ‘తని ఒరువన్’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.