
ది వీసా ఇంటర్వ్యూ– షార్ట్ ఫిల్మ్
నిడివి: 10 ని. 10 సె.; హిట్స్: 14,94,800
‘వైవా’ హర్షా మళ్లీ ఎటాక్ చేశాడు. ఈసారి అమెరికా వెళ్లడానికి ఉవ్విళ్లూరేవాళ్లు వీసాకు అటెండ్ అయ్యి ఎలాంటి సమాధానాలు చెప్తారన్న కంటెంట్ మీద వ్యంగ్యం విసిరాడు. ఈ కామెడీ షార్ట్ ఫిల్మ్‌లో హర్షా ఎంబసీలో ఆఫీసర్‌గా కనిపిస్తే మిగిలిన నటులు వీసాకు హాజరైనవారుగా ఉంటారు. వీసా రావాలంటే ‘ఐ లవ్ మై ఇండియా’ అనాలనీ, ఏదో ఒక డిగ్రీ చదవే మిషతో అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోవచ్చని, ఎన్.ఆర్.ఐ వరుణ్ణి కట్టుకుని ప్రిస్టేజి కోసం అమెరికాలో సెటిల్ కావాలనుకునేవారి సమాధానాలన్నీ ఈ ఇంటర్వ్యూలో హాస్యం తెప్పిస్తాయి. వీటన్నింటికి మించి ‘ఫ్రీ చైతన్యా పారాయణ’ ప్రతినిధి వీసా కోసం రావడం ఆకట్టుకుంటుంది. అమెరికాలో ఫ్రీ చైతన్యా పారాయణ ఇన్‌స్టిట్యూట్స్ పెట్టి హాస్టల్స్ తెరిచి వంద మందిని కుక్కి రెండు మూడు ఆత్మహత్యలు చేయిస్తే తప్ప శాంతి లేదన్నట్టుగా ఆ ప్రతినిధి వీసాకు వస్తాడు. కానీ వీసా ఆఫీసర్ లక్కీగా అతడి వీసాను రిజెక్ట్ చేస్తాడు. అలరించిన ఈ షార్ట్ ఫిల్మ్ పోస్ట్ అయిన వెంటనే పది లక్షల హిట్స్‌కు చేరుకుంది.
సమంతా రంగస్థలం– టీజర్
నిడివి: 28 సె.; హిట్స్: 57,80,100
పల్లెటూరి అమ్మాయిలను పల్లెటూరి అమ్మాయిలుగా చూసి చాలా కాలం అవుతోంది. అయితే ‘రంగస్థలం’ ఎనభైల కాలం నాటి కథ కాబట్టి ఆ కాలం నాటి పల్లెటూరి ఆడపిల్లలు ఆ సినిమాలో కనిపించే అవకాశం ఉంది. ఆ మాటకు ఊతమిస్తూ ‘సమంతా’పై విడుదల చేసిన రంగస్థలం టీజర్ విడుదలైన వెంటనే భారీ హిట్ అయ్యింది. నడుము వయ్యారంగా తిప్పుతూ నీళ్ల చెరువులోకి వెళుతున్న సమంతా, సైకిల్ తొక్కుతున్న సమంతా, చాకిరేవులో బట్టలుతుకుతున్న సమంతా ‘ఈ పిల్ల ఎదురైతే మా ఊరికి పద్దెనిమిదేళ్ల వయసొచ్చేలా ఉంటుందండీ’ అని రామ్ చరణ్ డైలాగును నమ్మబలికేలా ఉంది. దాదాపు 50 లక్షల హిట్స్‌కు ఈ టీజర్ చేరువైంది.
గోల్డ్ – టీజర్
నిడివి: 1ని. 7 సె.; హిట్స్: 1,19,40,760
సినిమాటిక్ కథలతో విసిగిపోయిన బాలీవుడ్ బయోపిక్స్ వెంట గత చారిత్రక ఘటనల వెంట పరుగు తీస్తోంది. జనం ఆ సినిమాలను మెచ్చుకుంటున్నారు కూడా. తాజాగా ఇండియా హాకీ వెలుగులను తెలియచేసే ‘గోల్డ్’ అనే సినిమా రాబోతోంది. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రధారి. భారతదేశం ‘బ్రిటీష్ ఇండియా’గా ఉన్నప్పుడు అనేక మెడల్స్ గెలిచింది. కాని స్వాతంత్య్రం వచ్చాక 1948 ఒలింపిక్స్‌తో తొలి బంగారు పతకం గెలిచింది. ఆ పతకం గెలవడానికి భారత జట్టు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కొన్నది అనేది కథ. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది. ఆమిర్‌ఖాన్‌తో గతంలో ‘తలాష్’ తీసిన రీమా కాగ్తీ ఈ సినిమాకు దర్శకురాలు. కోటి హిట్స్‌ను దాటిపోయిన టీజర్ ఇది.
Comments
Please login to add a commentAdd a comment