
పలీనా పుపోవా.. ఫ్రమ్ రష్యా
మిస్ వరల్డ్ 2017 ఇంట్రడక్షన్ అండ్ డాన్సెస్
నిడివి 5 ని. 45 సె.
హిట్స్ 16,06,750
హరియాణా అమ్మాయి మానుషీ షిల్లర్ నవంబర్ 18న మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. టైటిల్ ప్రకటన ఈవెంట్‌కు ముందు ఇంట్రడక్షన్ పార్టే ఈ వీడియో. అమ్మాయిలు ఒక్కొక్కరూ వచ్చి పేరు, దేశం పేరు చెప్పుకుంటున్నారు. మన అమ్మాయీ వచ్చింది. ‘ఐయామ్ మానుషీ షిల్లర్, రిప్రజెంటింగ్ ఇండియా’ అని చెప్పింది. తర్వాత దేశదేశాల డాన్సులు.
మన దేశం వంతు వచ్చినప్పుడు మానుషీ షిల్లర్ ఓ బాలీవుడ్ సాంగ్‌కి డాన్స్ వేసింది. ఇదంతా టీవీలో చూడలేకపోయినవారు ఈ వీడియోలో చూడొచ్చు. చిన్న గుసగుస. వీడియో చూసినవాళ్లు ఇందులో రష్యా అమ్మాయే అందరికన్నా బాగుంది అంటున్నారట! డాన్స్‌లలో చైనా డాన్స్ బాగుందట! బాగోవడం, బాగోలేకపోవడం కాదు కానీ.. ప్రతి దేశానికీ ఒక అందం ఉంది. ఒక చందం ఉంది. దేనికదే గ్రేట్.
నాన్నా.. నేనొస్తున్నా...
ఎ రింకిల్ ఇన్ టైమ్: ట్రైలర్
నిడివి 2 ని. 24 సె.
హిట్స్ 22,30,955
మెగ్ ముర్రే ఒక సైంటిస్ట్ కూతురు. వయసు 14. పిల్ల బ్రిలియంట్! తండ్రి ఆస్ట్రోఫిజిసిస్ట్. ఖగోళ పరిశోధనలేవో చేస్తూ ఆయన ఏ దుష్ట గ్రహానికో బందీగా చిక్కుతాడు. దుష్టగ్రహం అంటే.. గ్రహం దుష్టురాలు అని కాదు. ఆ గ్రహంలో ఒక దుష్టశక్తి ఉంటుంది. అదే ఆయన్ని తన గ్రిప్‌లోకి తీసుకుంటుంది. ఇది తెలిసి మెగ్ ముర్రే విషాదంలో మునిగిపోతుంది. స్టడీస్ మీద ధ్యాస పెట్టలేదు. టీచర్ గమనించి, ‘ఫైట్ ఫర్ యువర్ డాడ్.. బేబీ’ అంటుంది.
ఈ అమ్మాయి ఇంటెలిజన్స్ మీద ఆ టీచర్‌కి అంత నమ్మకం. మెగ్ ముర్రే డిసైడ్ అయిపోతుంది, ఎలాగైనా డాడీని కాపాడుకోవాలని. ముర్రేకి ఒక తమ్ముడు ఉంటాడు. వాడు ఇంకా షార్ప్. ఎంతైనా సైంటిస్టుల ఫ్యామిలీ కదా! వాడి పేరు చార్ల్స్ వాలెస్. వీళ్లద్దరికీ కాల్విన్ ఒకీఫ్ అనే క్లాస్‌మేట్ తోడవుతాడు. ఇప్పటికి ముగ్గురయ్యారు కదా, ఇంకో ముగ్గుర్ని జత చేసుకుంటారు. ఆ ముగ్గురూ ఆస్ట్రల్ ట్రావెలర్స్.
మిసెస్ విచ్, మిసెస్ హూ, మిసెస్ వాట్స్‌ఇట్. అంతా కలిసి ఆరుగురు అవుతారు. విశ్వాంతరాళాల్లోకి వెళ్లిపోయి ఆ సైంటిస్టును కాపాడతారు. 2018 మార్చి 9న విడుదల అవుతున్న సైన్స్ ఫ్యాంటసీ హాలీవుడ్ అడ్వెంచర్ ఫిల్మ్ స్టోరీ ఇది. ఈ మూవీ ట్రైలర్‌ని డీస్నీ విడుదల చేసింది. మిసెస్ విచ్‌గా విశ్వవిఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే మీకు ఇందులో కనిపిస్తారు. ఇంకా చాలా వండర్స్ కనిపిస్తాయి.
పులి బతికే ఉంది భయ్యా
స్వాగ్ సె స్వాగత్ సాంగ్: టైగర్ జిందా హై
నిడివి 2 ని. 49 సె.
హిట్స్ 2,96,76,301
సల్మాన్, కత్రీనాల కొత్త మూవీ ‘టైగర్ జిందా హై’లోని ‘స్వాగ్ సె స్వాగత్’ యూట్యూబ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. స్పెక్టాక్యులర్ అనుకోండి! సల్మాన్ యంగ్ లుక్‌తో ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అవును బాస్! ఫార్ బెటర్ దేన్ హిజ్ హీరోయిన్. ఇషాద్ కామిల్ పాటను రాస్తే, విశాల్–శేఖర్ కంపోజ్ చేశారు. దద్లానీ, నేహా పాడారు. పాటను గ్రీస్‌లోని ఒక దీవిలో షూట్ చేశారు.
బాలరీనాలు (ఉమన్ డాన్సర్స్), హిప్–హాప్, ఆఫ్రో డాన్స్ హాల్ పెర్మార్మెన్స్ మొత్తం వంద మందిని గ్రీస్, ఫ్రాన్స్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నుంచి ఎంపిక చేసుకుని డాన్స్ చేయించారు. ‘ఏక్ థా టైగర్’ సీక్వెల్‌గా దాదాపు ఐదేళ్ల తర్వాత వస్తున్న ‘టైగర్ జిందా హై’ డిసెంబర్ 22న గాండ్రించబోతోంది. ఈ వీడియోలో సల్మాన్, కత్రీనా కంబైండ్‌గా ఒక ప్రేమ సందేశాన్ని వినిపించేందుకు ప్రపంచానికి స్వాగతం పలుకుతారు. ప్రేమ లేకుండా జీవితంలో ఏదీ లేదని మీనింగ్. కుచ్ నహీ, కుచ్ నహీ ఇష్క్ సే బెహ్తార్ అని కూడా. సాంగ్ అద్దిరిపోయిందబ్బా!
తిక్క మొగుడు తింగరి పెళ్లాం
పింక్ – బ్యూటిఫుల్ ట్రామా
నిడివి 4 ని. 57 సె.
హిట్స్ 1,34,80,670
ఈ వీడియోలో మెయిన్‌గా మీకు పింక్ కలర్ కనిపిస్తుంది. బ్లూస్, గ్రీన్స్ కూడా. హౌస్‌వైఫ్, ఆమెగారి భర్త.. తీరిక వేళల్లో 1960ల నాటి శకలన్నీ పడుతూ ఉంటారు. ఇంటి పనితో ఆమెకు, పేపర్ రీడింగ్‌తో ఆయనకు తెల్లారుతుంది. (ఏ దేశమేగినా, ఎందుకాలిడినా ఈ సీన్ మారదేమో!) తర్వాత ఆయన ఆమె గౌను, ఆమె ఆయన సూట్ వేసుకుని డాన్స్ చేస్తుంటారు. మద్యాన్ని సేవించి.. ‘మై లవ్.. మై లవ్.. మై లవ్..’ అంటూ ఒకరిపై ఒకరు తూలిపడుతుంటారు.
ఆమె ఆయన కాళ్లూ చేతులు కట్టేసి, కొట్టడానికి కొరడా తీసుకుంటుంది. ప్రఖ్యాత హాలీవుడ్ డాన్స్ పార్ట్‌నర్స్ ఫ్రెడ్ ఆస్టయిర్, జింజర్ రోజర్స్‌కు గౌరవ నివాళిగా చానింగ్ టేటమ్ (భర్త), పింక్ (భార్య) ఈ వీడియోను సమర్పించారు. అంటే జింజర్‌గా.. పింక్, ఫ్రెడ్‌గా.. చానింVŠ టేటమ్ యాక్ట్ చేసి, డాన్స్ చేశారు. పింక్ అసలు పేరు అలీషియా బెత్ మూర్ (38). అమెరికన్ పాప్ సింగర్. ఇక చానింగ్ టేటమ్ (37) అమెరికన్ యాక్టర్. భార్య చూడకుండా భర్త తన కాఫీలో ఆల్కహాల్ కలుపుకోవడం, భర్త కంటపడకుండా భార్య ఎనర్జీ పిల్స్ గుటుకూ గుటుకూమని మింగేయడం.. ఇంకా ఇలాంటి దొంగపనులతో వీడియో స్పీడప్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment