ఈ వారం యూటూబ్ హిట్స్ | This week Youtube hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూటూబ్ హిట్స్

Published Sun, May 1 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

ఈ వారం యూటూబ్ హిట్స్

ఈ వారం యూటూబ్ హిట్స్

హౌస్‌ఫుల్ 3 : ట్రైలర్
ఈ ఏడాది జూన్ 3న విడుదల అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘హౌస్‌ఫుల్ 3’ అఫిషియల్ ట్రయల్ రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ న్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి వారితో కామెడీ పండించడంలో ఫర్హాద్ సాదిజ్ (దర్శకుడు) సక్సెస్ కొట్టారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ‘నేను బటూక్ పటేల్. లండన్ సిటీ లక్కీయెస్ట్ ఫాదర్. ఎందుకంటే నవనాగరికులైన ముగ్గురు కూతుళ్ల తండ్రిని నేను’ అంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుండే బొమన్ ఇరానీతో ట్రైలర్ మొదలవుతుంది.

వెంటనే ఆ ముగ్గురు కూతుళ్లూ ఆయన చెప్పినట్లుగానే నవ నాగరిక దుస్తులలో నవ్వుతూ, తుళ్లుతూ దర్శనం ఇస్తారు. అయితే వాళ్లకు పెళ్లి చెయ్యడం బొమన్‌కు ఇష్టం ఉండదు. వాళ్లు మాత్రం చక్కగా ప్రేమలో పడతారు. ఇక వాళ్ల బాయ్‌ఫ్రెండ్స్ పని.. ఆ అమ్మాయిల తండ్రిని తమ పెళ్లికి ఒప్పించడం. అందుకోసం ఆ ముగ్గురు హీరోలు ఎన్ని పాట్లు పడ్డారు  అన్నది సినిమాలో చూడవచ్చు. ట్రైలర్ ఆల్రెడీ హిట్ కొట్టేసింది.
 నిడివి : 3 ని. 27 సె.
 హిట్స్ : 78,97,608
 
కపిల్ శర్మ షో - ఎపిసోడ్ 2
లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘బాగీ’ హీరో టైగర్ ష్రాఫ్, అందులోనే ఆయన సరసన నటించిన అపురూప అందాల తార శ్రద్ధాకపూర్ కలిసి కపిల్ శర్మ దర్బార్‌లో అక్కడి గ్యాంగ్‌తో సినిమా ప్రమోషన్ కోసం వేసిన స్కిట్‌ల వంటి వీడియో షూట్ ఇది. సోనీ టీవీలో రెండో ఎపిసోడ్‌గా ఇది ప్రసారం అయింది. కలర్స్ టీవీ చానెల్ నుంచి విడిపోయి వచ్చి, కొంత విరామం తర్వాత కపిల్ శర్మ.. సోనీలో తన షోని మొదలు పెట్టారు. తొలి ఎపిసోడ్ ఏప్రిల్ 23న టెలికాస్ట్ అయింది. దానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.

కడుపు చెక్కలయ్యేలా నవ్వించడంలో తన సత్తా కొద్దిగానైనా తగ్గలేదని కపిల్ కూడా తన రీ ఎంట్రీతో నిరూపించుకున్నారు. ఇప్పుడీ రెండో ఎపిసోడ్‌లోనూ అతడు దానిని నిలబెట్టుకున్నాడు. వీడియో నిడివి కాస్త పెద్దదే అయినా... అందులోని గిలిగింతల కామెడీ వల్ల వీక్షణ సమయం ఎక్కువగా ఉన్నట్లు అనిపించదు.
 నిడివి : 1 గం. 10 ని.16 సె.
 హిట్స్ : 30,71,929

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement