ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
ది మార్టియన్
నిడివి : 3 ని. 17 సె.
హిట్స్ : 9,88,110
నవలగా ఆకట్టుకున్న సైన్స్-ఫిక్షన్ ‘ది మార్టియన్’. ఇప్పుడు రిడ్లే స్కాట్ డెరైక్షన్‌లో సినిమాగా వస్తోంది. డ్య్రూ గోడార్డ్ రూపొందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు వెన్నెముకగా నిలవనుంది. మాట్ డమన్ (మార్క్ వాట్నె) అనే వ్యోమగామి అంగారకగ్రహంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది కథాంశం. వచ్చే అక్టోబర్‌లో విడుదల కానున్న ‘ది మార్టియన్’ సినిమా హిట్ కావడం ఖాయమని ఈ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చెబుతోంది. ‘ది మార్టియన్’ ట్రైలర్ ఈ వారం క్వికెస్ట్ యూ ట్యూబ్ హిట్‌గా నిలిచింది.
క్వాంటికో
నిడివి : 14 సె.
హిట్స్ : 2,11,844
క్వాంటికో పేరుతో ఒక అమెరికన్ టెలివిజన్ థ్రిల్లర్ రాబోయే సెప్టెంబర్ నుంచి ప్రసారం కానుంది. సఫ్రాన్, మార్క్ గోర్డెన్ ద్వయం సమర్పిస్తున్న ఈ థ్రిల్లర్ సీరిస్‌లో మన ప్రియాంకచోప్రా కూడా నటిస్తోంది! అమెరికన్ టీవీ సీరిస్‌లో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి. ఎలెక్స్ పారిష్ అనే ఎఫ్‌బిఐ ట్రైనీగా ఈ సీరిస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది ప్రియాంక. ట్రైనీ ఎఫ్‌బిఐ అధికారుల చుట్టూ తిరిగే కథ ఇది. ఒక్కొక్కరికీ ఒక్కో నేపథ్యం ఉంటుంది.
దృశ్యం
నిడివి : 50 సె.
హిట్స్ : 2,73,353
దక్షిణాదిలో ఏ సినిమా హిట్ అయినా బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపుతారు. ‘మర్యాద రామన్న’ ‘సింగం’ రిమేక్‌లలో నటించిన అజయ్‌దేవగణ్ ఇప్పుడు దక్షిణాదిలో విజయం సాధించిన మరో సినిమా ‘దృశ్యం’లో కథనాయకుడిగా నటించారు. ఆయన సరసన నందిని పాత్రలో శ్రీయ నటించారు. రఫ్ క్యారెక్టర్లలో కనిపించే అజయ్‌దేవ్‌గణ్‌ను ‘దృశ్యం’లో విజయ్ అనే మధ్యతరగతి వ్యక్తిగా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదుగానీ, ట్రైలర్‌కు మాత్రం మంచి స్పందన లభిస్తోంది.
బన్‌గిస్తాన్
నిడివి : 2 ని. 25 సె.
హిట్స్: 3,47,992
ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉన్న ఇద్దరు ఔత్సాహిక టైస్ట్‌ల కథ ఇది. తమ సైద్ధాంతిక దృక్పథంతో ఈ ప్రపంచాన్ని రాత్రికే రాత్రే మార్చేయాలన్నది వారి ఆశయం. అయితే ఆశయం ఒకటి డిసైడ్ చేస్తే విధి మరొకటి డిసైడ్ చేసింది. తమ వేడి వేడి ఆలోచనలతో ఈ టైస్ట్‌లు ముప్పు తిప్పలు పడుతూ ప్రేక్షకులను చల్లగా, కడుపుబ్బా నవ్విస్తారు. రితేష్ దేశ్‌ముఖ్, పులకిత్ సామ్రాట్ నటించిన ఈ బాలీవుడ్ కామెడీ సెటైర్ ఫిల్మ్‌లో త్వరలోనే కామెడి బాంబుల మోత మోగనుంది.
అనౌక్ - ది విజిట్
నిడివి : 3 ని. 21. సె
హిట్స్ : 15,75,695
లెస్బియన్ దాంపత్య పాత్రలతో వచ్చిన భారతదేశపు తొలి వీడియో వాణిజ్య ప్రకటన ఇది. పేరు ‘ది విజిట్’. విడుదలై కనీసం రెండు వారాలైనా కాకుండానే ఇప్పటి వరకు దీనిని పదిహేను లక్షల మందికి పైగా వీక్షించారు. మింత్రా ఫ్యాషన్ పోర్టల్ తన ‘ఎత్నిక్ వేర్’ కలెక్షన్ కోసం దీనిని రూపొందించింది. ఇందులో కనిపించే ఇద్దరు అమ్మాయిలు... అచ్చు స్త్రీపురుష దంపతుల్లాగా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను చూపుకుంటూ, శారీరక సాన్నిహిత్యాన్ని ఫీలవుతూ, అల్లరిగా మాటలతో గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ ఇంటికి రాబోతున్న తమ పేరెంట్స్‌కు స్వాగతం చెప్పడం కోసం ముస్తాబు అవుతుంటారు. సేమ్ సెక్స్ మేరేజెస్ మీద ఉన్న మూస అభిప్రాయాలను, తృణీకార భావాలను పోగొట్టేందుకు తమ యాడ్ తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ‘మింత్ర ఫ్యాషన్’ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ అగర్వాల్ అంటున్నారు.