Sci-fiction
-
సైన్స్‌ఫిక్షన్ సినిమాలు చేస్తున్న స్టార్స్!
ప్రయోగం, పరిశోధన, భవిష్యత్ కాల ప్రయాణం, మరమనిషి, ఇలా సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో ముడిపడిపోయారు కొందరు నటీనటులు. సైన్స్‌ఫిక్షన్ చిత్రాలకు సై అంటూ సైన్ చేశారు. ఈ స్టార్స్ చేస్తున్న వెండితెర సైన్స్ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం.. 28వ శతాబ్దంలో... ఉన్నట్లుండి కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వెళితే ఎలా ఉంటుంది? అసలు.. 28వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే ఓ ఊహాత్మక కథ వెండితెరపైకి వస్తే అదే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రమట. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 18వ శతాబ్దంలో మొదలై 28వ శతాబ్దంలోకి ఈ కథ వెళ్తుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపి స్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజయ్యే చాన్స్ ఉందని టాక్. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. చారిత్రాత్మక కంగువా ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా వీడియో గ్లింప్స్‌ను బట్టి ఇది పూర్తి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనేది కొందరి ఊహ. కానీ చారిత్రాత్మక భాగం కొంతవరకే ఉంటుందని, ఎక్కువ శాతం సమకాలీన కాలంలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే కొంత భాగం 18వ శతాబ్దంలో ఉంటుందని, పరాక్రమవంతుడైన ఓ యోధుడు అంతు చిక్కని వ్యాధితో మరణించి, అతనే మళ్లీ జన్మించి, గత జన్మలో తాను ఎలా మరణించాడో తెలుసుకునే అంశాల సమాహారంగా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ‘కంగువా’ కథనం ఉంటుందని భోగట్టా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. కాగా ‘కంగువా’ సినిమాలోని తొలి భాగం 2024 ఏప్రిల్ 12న విడుదల కానున్నట్లు సమాచారం. ఫిక్షనల్ గ్యాంగ్‌స్టర్ సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే.. విభిన్నమైన పేర్లతో ఆపరేషన్స్ చేయడం, పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి అంశాలు మిళితమై ఉంటాయి. కానీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌కు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలను జోడించి ఓ కొత్త ప్రయత్నం చేశారు అధిక్ రవిచంద్రన్. విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ టైమ్‌ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. విశాల్‌కు జోడీగా రీతూ వర్మ నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఓ గ్రహాంతరవాసి కథ ఓ గ్రహాంతరవాసి భూగ్రహంపై నివాసం ఉండాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశం నేపథ్యంలో బాలీవుడ్లో గతంలో హృతిక్ రోషన్ ‘కోయీ.. మిల్ గయా’, ఆమిర్ ఖాన్ ‘పీకే’ వంటి సినిమాలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాస్త అటూ ఇటూగా ఈ చిత్రాల తరహాలోనే తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ ఉంటుందట. శివ కార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఈ సినిమాలో ఓ ఏలియన్ పాత్ర ఉన్నట్లు పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇండియాలో ఏలియన్స్ ఉంటే.. ఇండియాలో ఏలియన్స్ నివాసం ఏర్పాటు చేసుకోవాలను కుంటే ఏం జరుగుతుంది? అనే పాయింట్‌తో తమిళ చిత్రం ‘ఏలియన్’ రూపొందుతోందట. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. రోబోలుగా హీరోయిన్లు ఓ మనిషిని రోబో ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ రజనీకాంత్ ‘రోబో’లో చూశాం. అయితే ఓ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ రోబోతో ప్రేమలో పడితే, రోబోలు ప్రేమించుకుంటే.. అనే అంశాలతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోందని టాక్. షాహిద్ కపూర్, కృతీ సనన్ జంటగా నటిస్తున్న ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కథ ఇది అని సమాచారం. అమిత్ జోషి, ఆరాధన షా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోబోగా కృతీ సనన్, రోబోటిక్ ఎక్స్పర్ట్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారట. మరోవైపు ‘ఎంవై 3’ అనే సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు హన్సిక. ఇందులో హన్సిక చేస్తున్న రెండు పాత్రల్లో రోబో పాత్ర ఒకటి. - శ్రీశ్రీ -
కృత్రిమ మేధస్సుతో...
శ్రవణ్ రెడ్డి, రియా కపూర్ జంటగా వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. దేవాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్యామ్ దేవభక్తుని నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు అజయ్ ఘోష్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత కిరణ్ స్క్రిప్ట్ అందించగా, వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వం వహించారు. ‘‘కృత్రిమ మేధస్సు నేపథ్యంలో భారతదేశపు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులోని ప్రధాన సన్నివేశాలను వర్చ్యువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్, కెమెరా: అఖిల్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్ గోపరాజు. వీరు, శ్రీహర్ష హీరోలుగా, కుషీచౌహాన్, నిషా సింగ్ హీరోయిన్లుగా తోట కృష్ణ దర్శకత్వంలో ‘చండిక’ సినిమా ఆరంభమైంది. కేవీ పాపారావు నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. ‘‘హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు తోట కృష్ణ. ‘‘చండిక’కి నేనే కథ అందించాను’’ అన్నారు కేవీ పాపారావు. -
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
ది మార్టియన్ నిడివి : 3 ని. 17 సె. హిట్స్ : 9,88,110 నవలగా ఆకట్టుకున్న సైన్స్-ఫిక్షన్ ‘ది మార్టియన్’. ఇప్పుడు రిడ్లే స్కాట్ డెరైక్షన్‌లో సినిమాగా వస్తోంది. డ్య్రూ గోడార్డ్ రూపొందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు వెన్నెముకగా నిలవనుంది. మాట్ డమన్ (మార్క్ వాట్నె) అనే వ్యోమగామి అంగారకగ్రహంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది కథాంశం. వచ్చే అక్టోబర్‌లో విడుదల కానున్న ‘ది మార్టియన్’ సినిమా హిట్ కావడం ఖాయమని ఈ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చెబుతోంది. ‘ది మార్టియన్’ ట్రైలర్ ఈ వారం క్వికెస్ట్ యూ ట్యూబ్ హిట్‌గా నిలిచింది. క్వాంటికో నిడివి : 14 సె. హిట్స్ : 2,11,844 క్వాంటికో పేరుతో ఒక అమెరికన్ టెలివిజన్ థ్రిల్లర్ రాబోయే సెప్టెంబర్ నుంచి ప్రసారం కానుంది. సఫ్రాన్, మార్క్ గోర్డెన్ ద్వయం సమర్పిస్తున్న ఈ థ్రిల్లర్ సీరిస్‌లో మన ప్రియాంకచోప్రా కూడా నటిస్తోంది! అమెరికన్ టీవీ సీరిస్‌లో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి. ఎలెక్స్ పారిష్ అనే ఎఫ్బిఐ ట్రైనీగా ఈ సీరిస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోంది ప్రియాంక. ట్రైనీ ఎఫ్బిఐ అధికారుల చుట్టూ తిరిగే కథ ఇది. ఒక్కొక్కరికీ ఒక్కో నేపథ్యం ఉంటుంది. దృశ్యం నిడివి : 50 సె. హిట్స్ : 2,73,353 దక్షిణాదిలో ఏ సినిమా హిట్ అయినా బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపుతారు. ‘మర్యాద రామన్న’ ‘సింగం’ రిమేక్లలో నటించిన అజయ్‌దేవగణ్ ఇప్పుడు దక్షిణాదిలో విజయం సాధించిన మరో సినిమా ‘దృశ్యం’లో కథనాయకుడిగా నటించారు. ఆయన సరసన నందిని పాత్రలో శ్రీయ నటించారు. రఫ్ క్యారెక్టర్లలో కనిపించే అజయ్దేవ్గణ్ను ‘దృశ్యం’లో విజయ్ అనే మధ్యతరగతి వ్యక్తిగా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదుగానీ, ట్రైలర్‌కు మాత్రం మంచి స్పందన లభిస్తోంది. బన్గిస్తాన్ నిడివి : 2 ని. 25 సె. హిట్స్: 3,47,992 ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉన్న ఇద్దరు ఔత్సాహిక టైస్ట్‌ల కథ ఇది. తమ సైద్ధాంతిక దృక్పథంతో ఈ ప్రపంచాన్ని రాత్రికే రాత్రే మార్చేయాలన్నది వారి ఆశయం. అయితే ఆశయం ఒకటి డిసైడ్ చేస్తే విధి మరొకటి డిసైడ్ చేసింది. తమ వేడి వేడి ఆలోచనలతో ఈ టైస్ట్లు ముప్పు తిప్పలు పడుతూ ప్రేక్షకులను చల్లగా, కడుపుబ్బా నవ్విస్తారు. రితేష్ దేశ్‌ముఖ్, పులకిత్ సామ్రాట్ నటించిన ఈ బాలీవుడ్ కామెడీ సెటైర్ ఫిల్మ్‌లో త్వరలోనే కామెడి బాంబుల మోత మోగనుంది. అనౌక్ - ది విజిట్ నిడివి : 3 ని. 21. సె హిట్స్ : 15,75,695 లెస్బియన్ దాంపత్య పాత్రలతో వచ్చిన భారతదేశపు తొలి వీడియో వాణిజ్య ప్రకటన ఇది. పేరు ‘ది విజిట్’. విడుదలై కనీసం రెండు వారాలైనా కాకుండానే ఇప్పటి వరకు దీనిని పదిహేను లక్షల మందికి పైగా వీక్షించారు. మింత్రా ఫ్యాషన్ పోర్టల్ తన ‘ఎత్నిక్ వేర్’ కలెక్షన్ కోసం దీనిని రూపొందించింది. ఇందులో కనిపించే ఇద్దరు అమ్మాయిలు... అచ్చు స్త్రీపురుష దంపతుల్లాగా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను చూపుకుంటూ, శారీరక సాన్నిహిత్యాన్ని ఫీలవుతూ, అల్లరిగా మాటలతో గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ ఇంటికి రాబోతున్న తమ పేరెంట్స్‌కు స్వాగతం చెప్పడం కోసం ముస్తాబు అవుతుంటారు. సేమ్ సెక్స్ మేరేజెస్ మీద ఉన్న మూస అభిప్రాయాలను, తృణీకార భావాలను పోగొట్టేందుకు తమ యాడ్ తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ‘మింత్ర ఫ్యాషన్’ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ అగర్వాల్ అంటున్నారు.