Aryan Khan Drug Case: ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన ఎన్‌సీబీ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మొత్తం 8 మంది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో అర్భాజ్ మర్చంట్ ఒకరు. కాగా, అర్బాజ్ మర్చంట్ తండ్రి లాయర్ అస్లాం మర్చంట్ ఓ ఇంటర్వూలో డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఆర్యన్, తన కొడుకు ఇద్దరూ నిర్దోషులని తెలిపారు.
‘ఓ లాయర్‌గా నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది. కేసు విచారణలో ఉండగా దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ వారిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. వారిద్దరూ నిర్ధోషులు’ అని అస్లాం అన్నారు. అంతేకాకుండా కేసు విషయంలో ఎన్‌సీబీ విధానం బావుందని, పిల్లలను మంచిగా ట్రీట్ చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా ‘డ్రగ్స్‌కి సంబంధించిన వాట్సాప్ చాట్‌లు ఖచ్చితంగా లేవు. వారు పార్టీకి సిద్ధం కాలేదు. చాటింగ్‌లో షిప్‌కి వెళ్లడానికి చివరి నిమిషంలో జరిగిన చర్చ మాత్రమే ఉంది. ఆ పార్టీకి వారు ఆహ్వానితులు అంతే తప్ప వారికి దీనికి ఏం సంబంధం లేదు’ అని తెలిపారు. కాగా కేసు విచారణ కోసం నిందితుల ఎన్‌సీబీ కస్టడీని అక్టోబర్ 7వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
చదవండి: ఆర్యన్ ఖాన్‌తో లీకైన ఫోటో.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీబీ
Comments
Please login to add a commentAdd a comment