Shah Rukh Khan Gives Party to legal team After Aryan Khan Bail - Sakshi
Sakshi News home page

Aryan Khan Drug's Case: ఆర్యన్‌కి బెయిల్.. లీగల్ టీంతో పార్టీ చేసుకున్న షారుక్‌

Published Sat, Oct 30 2021 12:01 PM | Last Updated on Sat, Oct 30 2021 12:37 PM

Shah Rukh Khan Gives Party to Pooja Dadlani and his legal team After Aryan Khan Bail - Sakshi

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ ముంబై  డ్రగ్స్ కేసులో అక్టోబర్‌ మొదటి వారంలో అరెస్టైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు సార్లు బెయిల్‌ రిజెక్ట్‌ అయ్యింది.  ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య దాదాపు నాలుగు వారాల తర్వాత బెయిల్‌ అక్టోబర్‌ 28న బెయిల్‌ మంజూరైంది.

ఆర్యన్‌ బెయిల్‌ గురించి లాయర్‌ సతీష్‌ మనేషిండే మట్లాడుతూ.. ‘అరెస్టు అయినప్పుడు ఆర్యన్‌ దగ్గర ఎటువంటి డ్రగ్స్‌ దొరకలేదు. అతను మత్తు పదార్థాలు తీసుకోలేదు. దానికి ఎటువంటి సాక్ష్యం కూడా లేదని మేము వాదించడంతో సమ్మతించిన జస్టిస్‌ నితిన్‌ సాంబ్రే బెయిల్‌ మంజూరు చేశారు. సత్యమేవ జయతే’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఆర్యన్‌కి బెయిల్‌ కోసం షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లనీ, లీగల్‌ టీం సతీష్‌ మనేషిండే బృందం ఎంతో కృషి చేసింది. దీంతో ఎంతో సంతోషంలో ఉన్న షారుక్‌ వారికి పార్టీ ఇచ్చాడని తెలుస్తోంది. ఆర్యన్‌ అరెస్టు తర్వాత లీగల్‌ టీంతో కలిసి మీడియాకి నవ్వుతూ ఫోటోలకి ఫోజులిచ్చాడు బాద్‌ షా. అంతేకాకుండా  మరో పక్క ఆయన అభిమానులు సైతం స్టార్‌ ఇంటి వద్ద బాణాసంచా తమ సంతోషాన్ని తెలియజేశారు.

చదవండి: జైలు నుంచి విడుదలైన ఆర్యన్‌ ఖాన్‌.. మన్నత్‌లో సంబరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement