
ఎట్టకేలకు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ రోజు ఆర్యన్ బెయిల్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజురూ చేసింది. ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఎన్‌సీబీ తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు ఆర్యన్‌తో పాటు మోడల్ మున్‌మున్ ధమేచ, ఆర్భాజ్ మర్చంట్‌కు కూడా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆర్యన్ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు ‘బాద్‌షా’ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
ఈ నెల అక్టోబర్ 2వ తేదీ అర్థరాత్రి క్రూయిజ్ ఓడరేవు డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖిలో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆర్యన్ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడి బెయిల్ పిటిషన్‌కు ముంబై కోర్టు మూడు స్లార్లు కొట్టివేసింది. దీంతో ఆర్యన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా చివరికి అతడికి ఊరట లభించింది. ఆర్యన్ బెయిల్ పటిషన్‌పై మూడు రోజుల విచారణ అనంతరం హైకోర్టు నేడు(గురువారం) ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్ ఇచ్చింది. (Aryan Khan bail: ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment