Fact Check: Shah Rukh Son Aryan Khan Urinating In Public At Airport Real Or Fake? - Sakshi
Sakshi News home page

Factcheck: అందరి ముందే పని కానిచ్చేసిన ఆర్యన్‌ ఖాన్‌?

Published Wed, Jan 5 2022 1:00 PM | Last Updated on Wed, Jan 5 2022 6:16 PM

Fact Check on Aryan Khan Urinating in Public At an Airport - Sakshi

విమానాశ్రయంలో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగా బహిరంగ మూత్రవిసర్జన చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్‌ కేసులో అరెస్టయి బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఇలాంటి గలీజ్‌ పని చేసి పోలీసుల చేత చీవాట్లు తిన్నాడంటూ పలువురు నెటిజన్లు సదరు వీడియోను షేర్లు చేస్తున్నారు.

వాస్తవమేంటంటే ఆ వీడియో నిజమే కానీ అందులో ఉన్న వ్యక్తి మాత్రం ఆర్యన్‌ ఖాన్‌ కాదు. కెనడియన్‌ నటుడు బ్రోన్సన్‌ పెలెటియర్‌. 2012లో లాస్‌ ఎంజిల్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో అందరిముందే పని కానిచ్చేయడంతో అధికారులు అతడిని అరెస్ట్‌ కూడా చేశారు. కాగా గతేడాది అక్టోబర్‌ 2న ముంబై క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం కేసులో ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే!  అక్టోబర్‌ 28న బాంబే హైకోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement