
డ్రగ్స్ కేసులో అరెస్టైన దాదాపు నెల తర్వాత షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. శనివారం బాద్ షా, గౌరీ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకువచ్చారు. ఈ స్టార్ కిడ్ ఇంటికి వస్తున్న విషయం తెలిసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మన్నత్‌లోని ఇంటి ముందు బ్యానర్స్ పట్టుకుని వేచి ఉన్నారు.
ఇంటికి తిరిగి వచ్చిన ‘ప్రిన్స్’ ఆర్యన్ ఖాన్‌కు అంటూ ఈ స్టార్‌కిడ్‌కి స్వాగతం పలికారు ఫ్యాన్స్. డోల్ బాజాలు వాయించి ఉత్సాహంగా అతను కనిపిస్తాడేమో అరిచారు. అయితే, ఆర్యన్ కారు నేరుగా ఇంటి లోపలికి వెళ్లడంతో మన్నత్ వెలుపల గుమిగూడిన అభిమానులు ఆర్యన్‌ను చూడలేకపోయారు. అయిన కొంచెం కూడా నిరాశ చెందకుండా అరుస్తూ తమ ఆనందాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోని ఎవరో అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఇంటి ముందు ఓ బాబా హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియో సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్
Comments
Please login to add a commentAdd a comment