
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు. శనివారం రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన పోలీసులు బాద్‌షా కుమారుడితోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పోలీసులు నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఇంతకుముందు ఆర్యన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కొట్టివేసిన కోర్టు.. అక్టోబర్ 7 వరకు ఎన్‌సీబీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజుతో గడువు ముగియగా.. ఈ కేసు విచారించిన కోర్టు మళ్లీ బెయిల్ నిరాకరించి.. అతడి కస్టడీని 14 రోజుల వరకు పొడిగించింది. అంతేకాకుండా ఈ కేసును ఇకపై ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.
చదవండి: ఆర్యన్ ఖాన్ పాత వీడియో వైరల్
#UPDATE | Mumbai court sends Aryan Khan, Arbaz Merchant and 6 others to judicial custody for 14 days in drugs seizure at cruise ship
— ANI (@ANI) October 7, 2021
Court says the case will now be heard by special NDPS court https://t.co/8rqko8epsc
Comments
Please login to add a commentAdd a comment