
Aryan Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో కటకటాలు లెక్కపెట్టిన ఆర్యన్ ఖాన్‌ను వెండితెరపై పరిచయం చేసేందుకు షారుక్-గౌహరీ ఖాన్ దంపతులు సమాయత్తం అవుతున్నారట. అందులో భాగంగా ఆర్యన్ ఖాన్ ప్రముఖ దర్శకుల దగ్గర ఫిల్మ్ మేకింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాడట! సెట్స్‌లో ఒక సన్నివేశాన్ని ఎలా చిత్రీకరిస్తారు? అందుకోసం ఎంత కష్టపడతారనేది దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మున్ముందు కూడా నిర్మాతలు ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్‌ల ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. పైగా ఈ మధ్యే ఆర్యన్.. ఆదిత్య చోప్రా వైఆర్‌ఎఫ్ స్టూడియోను సందర్శించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తండ్రి పఠాన్ సినిమాకు పని చేస్తున్నాడేమోనని గాసిప్స్ బయటకు వచ్చాయి. అలాగే కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాలకు సైతం అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి! అంటే మొత్తానికి ఆర్యన్ ఖాన్ త్వరలోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయం అవనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment