షారుఖ్‌ బీజేపీలో చేరితే డ్రగ్స్‌ కాస్తా షుగర్‌ అవుతుంది: ఛగన్ భుజ్‌భల్ | Drugs Become Sugar Powder if Shah Rukh joins BJP Maharashtra Minister | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ అలా చేస్తే డ్రగ్స్‌ షుగర్‌ అవుతుంది.. ‘మహా’ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sun, Oct 24 2021 4:32 PM | Last Updated on Sun, Oct 24 2021 4:46 PM

Drugs Become Sugar Powder if Shah Rukh joins BJP: Maharashtra Minister - Sakshi

ముంబై: డ్రగ్స్ కేసు ఇప్పుడు బాలీవుడ్‌ని కుదిపేస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించలేదు. ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ముంబైలోని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసుకు కొందరు నాయకులు రాజకీయాలను ముడిపెడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత ఛగన్ భుజ్‌భల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముంబైలో శనివారం జరిగిన సమతా పరిషత్- ఎన్‌సీపీ కార్యక్రమంలో మాట్లాడిన భుజ్‌భల్.. షారుఖ్‌ ఖాన్‌ బీజేపీలో చేరితే డ్రగ్స్‌ పౌడర్‌ కాస్తా షుగర్‌ పౌడర్‌ అవుతుందంటూ చమత్కరించారు. ఓబిసి కోటాపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని, అయితే బీజేపీ దానిని కోర్టులో సవాలు చేసిందని అన్నారు.

చదవండి: (సరిగ్గా తింటున్నావా? ఆర్యన్‌ను ప్రశ్నించిన షారుక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement