
Aryan Khan Still In Jail Even After Get Bail: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. గురువారం ఆర్యన్ బెయిల్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడితో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజురూ చేసింది. దీంతో ఆర్యన్ ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతాడని అందరూ ఆశించారు. కానీ చూస్తుంటే ఆర్యన్ ఈరోజు, రేపు కూడా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఆర్యన్ విడుదల అవ్వాల్సి ఉంగా ఇప్పటీ వరకు అతడి బెయిల్ ఆర్డర్ జైలుకు చేరలేదు.
చదవండి: ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు షరతులు
ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు బెయిల్ పత్రాల ప్రక్రియకు డెడ్‌లైన్ కానీ అతడి అది పూర్తి కాలేదు. దీంతో ఆర్యన్ విడుదల విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.