సిగ్గులేని రాజకీయాలు ఆర్యన్‌ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి: నటి | Raveena Tandon calls Aryan Khans Arrest Is Shameful Says Politics Spoils His Future | Sakshi
Sakshi News home page

సిగ్గులేని రాజకీయాలు ఆర్యన్‌ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి: నటి

Published Sat, Oct 9 2021 9:12 AM | Last Updated on Sat, Oct 9 2021 11:47 AM

Raveena Tandon calls Aryan Khans Arrest Is Shameful Says Politics Spoils His Future - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు. ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో ఈ స్టార్‌కిడ్‌తో పాటు మరో ఏడుగురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో బెయిల్‌ పిటిషన్‌ని కోర్టు కొట్టివేయగా..

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు. ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో ఈ స్టార్‌కిడ్‌తో పాటు మరో ఏడుగురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో బెయిల్‌ పిటిషన్‌ని కోర్టు కొట్టివేయగా.. వారిని ఆర్థర్‌ రోడ్‌ జైలుకి తరలించారు. 

అయితే చాలామంది నటులలాగే సినీయర్‌ నటి రవీనా టండన్‌ సైతం ఈ స్టార్‌కిడ్‌కి మద్దతుగా ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టింది. అందులో.. సిగ్గులేని రాజకీయాలు ఓ యువకుడి జీవితం, భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారి స్వలాభం కోసం ఇలా చేయడం బాధాకరమని నటి తెలిపింది.

అయితే ఆర్యన్‌ను ఈ కేసులో కావాలనే ఇరికించారని బాలీవుడ్ సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. వేరే ఏదో కేసును పక్కదోవ పట్టించాడనికి ఇలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఆర్యన్‌కు మరోసారి బెయిల్‌ నిరాకరణ, ఆర్థర్ రోడ్ జైలుకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement