సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్. ఖాన్‌త్రయంలో ఇప్పటికి కూడా సల్మానే సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నారు. 90ల నాటి నుంచి ఈ ముగ్గురు ఖాన్‌ల ఎదుగుదల ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు. ఈ విషయం గురించి సల్మాన్ వద్ద ప్రస్తావించగా.. 90ల కాలంలో ఇద్దరు సూపర్‌స్టార్ల ఎదుగుదల గురించి మాత్రమే అందరికి గుర్తుంది. వారిలో ఒకరు బాద్‌షా షారుక్ ఖాన్ కాగా మరొకరు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్. అయితే నా దృష్టిలో అసలైన సూపర్ స్టార్ వేరే ఉన్నారు. ఆయనే ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. దేశం ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని భారత ఆర్థిక వ్యవస్థను కష్టాల నుంచి విముక్తి చేసిన మన్మోహన్ సింగ్ నా దృష్టిలో నిజమైన సూపర్ స్టార్ అన్నారు సల్మాన్.
పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్న సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత హీన దశలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సింగ్‌ను పీవీ ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆ సమయంలో మన్మోహన్ ఒపెన్ మార్కెట్ల వ్యవస్థకు తలుపులు తెరిచి భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. 1991 - 92లో మన్మోహన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మక బడ్జెట్‌గా గుర్తింపు పొందింది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి మన్మోహన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నాడు మన్మోహన్ తీసుకన్న నిర్ణయాలే ప్రధాన కారణం.
Comments
Please login to add a commentAdd a comment