
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన సినిమాలన్ని బి-టౌన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపిస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల షారుక్ నటించిన ‘జీరో’ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది షారుక్ ఒక్కసినిమాలో కూడా నటించకపోవడంతో ఆయన సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టారని, మంచి సినిమా కథ కోసం చూస్తున్నారని, ఇదివరకే కొన్ని సినిమాలకు సంతకం చేశారంటూ పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్‌లో ఆదివారం లైవ్‌చాట్ నిర్వహించారు. (ఆన్‌లైన్‌లో కచేరి)
Wouldn’t know....try asking a superstar. I am just a King unfortunately... https://t.co/bvzBvg1S8B
— Shah Rukh Khan (@iamsrk) April 20, 2020
ఈ సందర్భంగా అభిమానులు తమ సందేహలను తనతో పంచుకోవాలని పిలుపు నిచ్చారు. దీంతో ఇటివల మీరు నటించిన సినిమాలు పరాజయం పొందాయి కదా. సూపర్ స్టార్‌గా ఆ వైఫల్యాన్ని ఎలా అధిగమించారు. ఆ తర్వాత సినిమాల పట్ల ఏవిధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అడగ్గా.. ‘ఏమో నాకు తెలియదు. ఈ విషయాన్ని మీరు సూపర్ స్టార్‌ను అడగండి. ఎందుకంటే నేను కింగ్ ఖాన్’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చాడు. అదే విధంగా మీరు సినిమాలకు రిటైర్‌మెంట్ ఇచ్చారని.. ఇక మీరు సినిమాల్లో నటించొద్దని నిర్ణయించుకున్నారంటు వస్తున్న పుకార్లపై నేను విసిగిపోయాను. వీటిపై మాకు కాస్తా స్పష్టతను ఇవ్వండి అని మరో అభిమాని ప్రశ్నించాడు. “మీరు విసిగిపోకండి. నేను ఖచ్చితంగా సినిమాలు చేస్తాను. అవి నిర్మించబడతాయి కూడా. దీనిపై మీకు త్వరలోనే స్పష్టత వస్తుంది’ అంటూ బాద్‌షా తనదైన శైలిలో బదులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment