వెండితెర మీద ఒకరు కత్తి పట్టుకుంటే మరొకరు గన్‌కు పని చెప్తున్నారు. ఇంకొకరు చేతులతో రఫ్పాడించేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇదంతా కామనే కాదా. ఇందులో కొత్త మ్యాటర్ ఏంటి అంటారా. అయితే ఈ యాక్షన్ అంతా చేస్తుంది సిక్స్ ప్యాక్ చేసిన యూత్ హీరోలు కాదు..ఆరు పదుల వయసు దాటిన హీరోలు. అరవై సంవత్సరాలకు దగ్గర అవుతున్నా మరి కొందరు కథానాయకులు. యాక్షన్ సీరియస్‌గా తీసుకొని..సిల్వర్ స్క్రీన్ మీద చెలరేగిపోతున్నారు. సౌత్ నుండి నార్త్ వరకు అందరు సినియర్ హీరోలు ...ఫైట్స్ మస్ట్ అంటున్నారు. వయసును లెక్క చేయకుండా వెండితెర మీద డిష్యూం డిష్యూం అంటున్నారు సీనియర్ హీరోలపై ఓ లుక్కేద్దాం.
‘విక్రమ్’ తో మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు లోక నాయకుడు కమల్ హాసన్. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.450 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి.. కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రం నటిస్తున్నాడు. ఇందులో కూడా భారీ యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక టాలీవుడ్‌లో మాస్ అనే పదానికి పర్యాద పదంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి తన మాస్ పవర్ చూపించాడు. అరవై ఏడు సంవత్సరాల ఈ సీనియర్ హీరో బాక్సాలు బద్దలు కొట్టేసాడు. వెండితెర మీద తనదైన యాక్షన్ మళ్లీ చూపించి,నాన్ బాహుబలి,నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో పాటు భవిష్యత్తులో చేయబోయే చిత్రాలలో యాక్షన్ మస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట చిరంజీవి.
అపుడపుడు మాస్ సినిమాలు చేసిన విక్టరీ వెంకటేష్.ఫ్యామిలీ సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు యాక్షన్ సినిమాల సత్తా ఏంటో తెలుసుకున్నాడు.నారప్పతో ఊర మాస్ ఆడియన్స్‌ను కనికట్టు చేసిన వెంకీమామ, కెరీర్‌లో 75 వ సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ జోనర్‌లో చేస్తున్నాడు. ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ఖరారు చేశారు.
నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్‌కి విమర్శల నుంచి కూడా ప్రశంలు వచ్చాయి. తర్వాత సూపర్ నాచురల్ యాక్షన్ డ్రామతో చేసిన బంగార్రాజు కూడా హిట్ కొట్టింది. అయితే గత ఏడాది ఘోస్ట్‌గా యాక్షన్‌తో థ్రిల్లర్ చేద్దాం అనుకున్న నాగ్‌కు చేదు అనుభవం ఎదురయింది. అయినా..కెరీర్‌లో వందో సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ జోనర్ చేయటానికి ట్రై చేస్తున్నాడట నాగ్
సీనియర్ హీరో రజనీకాంత్ కూడా..యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. 72 ఏళ్ల వయసులో అభిమానుల కోసం కష్టపడుతున్నాడు. సూపర్ స్టార్ సూపర్ పవర్ చూపిస్తున్నాడు.వరసగా ఈయన చేస్తున్న మూవీస్ అన్ని యాక్షన్ జోనర్‌లోనే రూపొందుతున్నాయి. తనదైన మెనరిజమ్స్,స్టైల్స్‌తో..అలరిస్తూ..తగ్గేదే లే అంటున్నాడు.
మరో కోలీవుడ్ స్టార్ అజిత్ కూడా వరసగా యాక్షన్ మూవీస్‌తోనే వస్తున్నాడు. మరో వైపు మలయళ సూపర్ స్టార్లు మమ్ముట్టి,మోహన్ లాల్ కూడా ఈ జోనర్ మూవీస్ తో అలరిస్తున్నారు. ఫైట్స్ చేయాలి అంటే..ఏజ్‌తో పనేం ఉంది అని నిరూపిస్తున్నారు. కోరి మరి ఇలాంటి సినిమాలలో నటిస్తున్నారు.
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోలా మాదిరే శాండల్ వుడ్‌లో సీనియర్ హీరో శివరాజ్ కుమార్ కూడా తనదైన యాక్షన్ చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈయన నటించిన యాక్షన్ డ్రామ వేద ..మంచి విజయం సాధించింది. ఇదే సినిమా ఈ మధ్యనే తెలుగులో కూడా కూడా డబ్బింగ్ జరుపుకొని ,ఇక్కడ కూడా రిలీజ్ అయింది.
పఠాన్‌తో కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు బాలీవుడ్ బాలీవుడ్ బాద్షా. ఈ చిత్రం ఇప్పటికే రూ.1000 కోట్లు వసూళ్లను సాధించి రికార్డలు క్రియేట్ చేసింది. జిందాగిలో ఎప్పుడు చేయనటువంటి యాక్షన్‌ని ఈ సినిమాలో చేసి చూపించాడు కింగ్‌ఖాన్. అభిమానుల కోసం కష్టమైన స్టంట్స్ చేసి మెస్మరైజ్ చేశాడు. తర్వాత అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు షారుఖ్. జవాన్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ కూడా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ జోనర్‌లోనే తెరకెక్కింది.
బాలీవుడ్‌లో మరికొందరు సీనియర్ స్టార్లు కూడా యాక్షన్ జోస్ చూపిస్తున్నారు.షారుఖ్ ఖాన్‌తో పాటు,ఆమిర్ ఖాన్,సల్మాన్ ఖాన్,అజయ్ దేవగన్,అక్షయ్ కుమార్ లాంటి వారు కూడా..సిక్స్టి ఇయర్ ఏజ్‌కు దగ్గరగా ఉన్నావారే.వీళ్లు కూడా ఏ మాత్రం తీసుపోని రకంగా ఫైట్స్ చేస్తున్నారు.వెండితెర మీద విలన్స్‌ను రఫ్ ఆడిస్తూ,ఫ్యాన్స్‌తో జే జేలు పలికించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment