
న్యూఢిల్లీ : తన పిల్లల కోసమే హాలీవుడ్ యాక‌్షన్ అడ్వెంచర్ 'లయన్‌కింగ్'ను 40 సార్లు చూసినట్లు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వెల్లడించారు. అయితే సినిమా మొత్తం కాదని, కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే చూసినట్లు పేర్కొన్నాడు. అయితే లయన్ కింగ్ సినిమాలో కీలకపాత్రలైన కింగ్ ముసఫా, సింబాలకు హిందీ వెర్షన్‌లో షారుక్, ఆయన తనయుడు ఆర్యన్‌లు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. 'ఈ వీకెండ్‌లో మీరు ఎలాంటి ఆలోచన లేకుండా మీ పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేసే సినిమాగా లయన్ కింగ్ నిలిచిపోతుందని' కింగ్ ఖాన్ స్పష్టం చేశాడు.
'జంగిల్ బుక్' సినిమాతో తనేంటో నిరూపించుకున్న డైరక్టర్ 'జాన్ పేవ్‌రూ' మరోమారు లయన్ కింగ్ సినిమాతో ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రఖ్యాత డిస్నీవాల్ట్ సంస్థలో రూపొందిన లయన్ కింగ్ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్న సింబాతో పాటు, మిగతా పాత్రలను ఐకానిక్ ఫీస్ట్‌గా మలిచిన విధానం ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. కాగా, లయన్‌కింగ్ సినిమా జూలై 19న ఇండియా వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు నాని, జగపతి బాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీలు గాత్రమందించారు.
Comments
Please login to add a commentAdd a comment