
అతిథి పాత్రలపై సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లున్నారు. ఆల్రెడీ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలోనూ సల్మాన్ ఓ గెస్ట్ రోల్ చేశారనే టాక్ బాలీవుడ్‌లో వినిపించింది. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న హిందీ మూవీ ‘వార్ 2’లో కూడా సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది.
వైఆర్‌ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ స్పై యూనివర్స్‌లోని ‘టైగర్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ నటించారు. దీంతో ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్ స్పైగా ఓ అతిథి ΄ాత్రను ΄ోషించేలా ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ కథలో చిన్న మార్పు చేశారట. మరి... ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకే సీన్‌లో కనిపిస్తే సినిమా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ఇది నిజం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment