
క్లాసులు స్టార్టయ్యాయి. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. అరె.. ఇదేమన్నా జూన్ నెలా! అడ్మిషన్స్ ఓపెన్ అవ్వడానికి. ఏప్రిల్ బాబూ.. సమ్మర్‌ను ఫుల్‌గా ఏంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అంటే.. నిజమే.. కాకపోతే ఇది రియల్ స్కూల్ కాదు కదా. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమా కోసం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఓపెన్ చేసిన స్కూల్. అందుకే వేసవిలో ఓపెన్ చేశారు. గతేడాది నవంబర్‌లో అడ్మిషన్స్ స్టార్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా పునీత్‌మల్హోత్రా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’. ఆరేళ్ల క్రితం కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి సీక్వెల్ ఇది.
ఈ సినిమాతోనే వరుణ్‌ధావన్, అలియాభట్, సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం స్టార్ యాక్టర్స్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందని చిత్రబృందం అనౌన్స్ చేసింది. అనన్యపాండే సెలక్ట్ అయ్యిందనీ, మిగిలిన హీరోయిన్ పాత్రలో జాన్వీ కపూర్ లేదా సారా అలీఖాన్‌ను ఎంచుకునే స్కోప్ ఉందని బాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఫైనల్‌గా ఎవరు నటించనున్నారన్నది ఈ రోజు ఎనౌన్స్ చేస్తామని నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. నవంబర్‌లో ఓపెన్ అయిన కరణ్‌జోహార్ స్కూల్ అడ్మిషన్స్ ఈ రోజుతో క్లోజ్ కానున్నాయన్నమాట. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment