శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ.. హీరో ఎవరంటే..? | Sreeleela To Make Bollywood Debut With Varun Dhawan | Sakshi
Sakshi News home page

Sreeleela: శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ.. హీరో ఎవరంటే..?

Published Tue, Jun 25 2024 10:55 AM | Last Updated on Tue, Jun 25 2024 11:05 AM

Sreeleela To Make Bollywood Debut With Varun Dhawan

యంగ్‌ బ్యూటీ శ్రీలీల తెలుగులో దూసుకెళుతున్నారు. ఇక ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ నటించనున్న ఓ హిందీ చిత్రం ద్వారా శ్రీలీల బాలీవుడ్‌ అరంగేట్రం జరగనుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా హిందీలో ఆమె తొలి చిత్రం ఇది కాదన్నట్లుగా మరో వార్త వైరల్‌గా మారింది. 

వరుణ్‌ ధావన్‌ హీరోగా రూపొందనున్న చిత్రం ద్వారా హీరోయిన్‌గా శ్రీలీల బాలీవుడ్‌ తెరపై కనిపించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని టాక్‌. శ్రీలీల ఓ హీరోయిన్‌గా, మృణాల్‌ ఠాకూర్‌ మరో హీరోయిన్‌గా నటిస్తారట. కామెడీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కించనున్నారని సమాచారం. 

జూలై నెల చివర్లో  చిత్రీకరణ ఆరంభించి, అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. మరి... శ్రీలీలకు హిందీలో ఇదే తొలి చిత్రం అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియా లంటే మరో నెల ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement