... అదేంటి మార్చి తర్వాత ఏప్రిల్ రావాలి కదా. మరి మార్చి తర్వాత అక్టోబర్ రావడమేంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం మా క్యాలెండర్ ఇలానే ఉంది అంటున్నారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. ‘విక్కీ డోనార్, పీకు’ ఫేమ్ సూజిత్ సర్కార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, బనితా సంధూ జంటగా రూపొందిన చిత్రం ‘అక్టోబర్’. ఈ సినిమాకు సంబంధించిన చిన్న మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు వరుణ్ ధావన్. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ తర్వాత ఏప్రిల్ బదులుగా అక్టోబర్‌ను చూపిస్తుంది క్యాలెండర్. ఏప్రిల్ 13న ‘అక్టోబర్’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
అందుకే మార్చి తర్వాత అక్టోబర్ అని వినూత్న రీతిలో విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ‘‘అక్టోబర్ సినిమా నాకు చాలా స్పెషల్. నటుడిగానే కాదు హ్యూమన్ బియింగ్‌గా కూడా ఈ సినిమా నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. నేచర్‌తో లవ్‌లో పడిపోయా’’ అని పేర్కొన్నారు వరుణ్ ధావన్. ఈ సినిమా కేవలం 38 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. రైజింగ్ సన్ బ్యానర్ పై రోన్నీ లహరీ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment