ఐపీఎల్‌ జరిగేలా లేదు  | Alex Carey Not Sure Of IPL Happening This Year | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ జరిగేలా లేదు 

Published Sun, Apr 19 2020 7:01 AM | Last Updated on Sun, Apr 19 2020 7:05 AM

Alex Carey Not Sure Of IPL Happening This Year - Sakshi

మెల్‌బోర్న్‌ : ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగేది అనుమానమే అని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ అభిప్రాయపడ్డాడు. తొలిసారి ఐపీఎల్‌లో ఆడబోతోన్న క్యారీ... ఈ ఏడాది ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోవచ్చని అన్నాడు. ‘ఇది నాకు తొలి ఐపీఎల్‌ సీజన్‌. ఢిల్లీ జట్టుకు ఆడేందుకు ఎదురుచూస్తున్నా. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే ఈ ఏడాది లీగ్‌ జరిగే అవకాశం కనిపించడంలేదు. కొన్నాళ్ల తర్వాత ఈ పరిణామాలన్నీ చక్కబడాలని కోరుకుంటున్నాను. అంతవరకు మనమంతా ఓపికగా ఎదురుచూడాల్సిందే’ అని ఆసీస్‌ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌ వైస్‌ కెప్టెన్‌ క్యారీ అన్నాడు. ‘గత రెండేళ్లుగా మైదానంలోనే గడుపుతున్నా. ఇప్పుడు కుటుంబంతో ఉండే అవకాశం దక్కింది ఈ సమయాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఉపయోగించుకుంటున్నా’ అని క్యారీ వివరించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement