ICC Confident Teams Travel For Pakistan For ICC Champions Trophy 2025.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవలే 2024- 2031 ఐసీసీ మేజర్ టోర్నీలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించనున్న దేశాల జాబితాను విడుదల చేసింది. అందులో 2025 చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో టోర్నీ అంటేనే కొన్ని దేశాలు భయపడిపోతున్నాయి. అక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయోనని క్రికెట్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది ఐసీసీకి పెద్ద సవాల్‌గా మారినుంది.
దీనికి తోడూ 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు ఉన్న బస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ దాడుల్లో ఆరుగురు పోలీసు అధికారులు.. ఇద్దరు పాకిస్తాన్ పౌరులు చనిపోయారు. ఇక శ్రీలంక ఆటగాడు థిల్లాన్ సమరవీర తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అప్పటినుంచి ఐసీసీ ఒక్క టోర్నీ కూడా నిర్వహించలేదు. పాకిస్తాన్ కూడా దుబాయ్ వేదికగానే తమ హోం సిరీస్‌లు ఆడింది. ఇక ఐసీసీ మేజర్ టోర్నీ 1996 వన్డే ప్రపంచకప్ భారత్, శ్రీలంక, పాకిస్తాన్‌లు కలిసి ఆతిథ్యమిచ్చాయి. ఒక ఐసీసీ మేజర్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వడం అదే చివరిసారి. ఇక తాజాగా టి20 ప్రపంచకప్ 2021కు ముందు న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకోవడం పాక్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులకు నిదర్శనం అని చెప్పొచ్చు.
చదవండి: Trolls On Babar Azam: మత్తు దిగనట్టుంది.. బంగ్లా సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు
ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్‌లే పాకిస్తాన్‌లో జరగనున్న 2025 చాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. '' చాంపియన్స్ ట్రోఫీకి దాదాపు నాలుగేళ్లు సమయం ఉంది. అప్పటిలోగా అన్ని జట్లు పాకిస్తాన్‌కు వెళతాయని భావిస్తున్నా. వారికి నమ్మకం పెంచడానికి పాకిస్తాన్ గడ్డపై ఈ గ్యాప్‌లో బైలెటరల్ సిరీస్‌లు ప్లాన్ చేసేలా ప్రణాళికలు రచించుకుంటాం. మనం పలానా దేశానికి వెళ్లి క్రికెట్ ఆడితేనే కదా.. ఆ దేశ క్రికెట్ బోర్డు తమ నమ్మకాన్ని కాపాడుకుంటుందో లేదో తెలిసేది. భద్రత విషయంలో మాత్రం మేం కఠినంగానే ఉండదలచుకున్నాం.
చదవండి: Ban Vs Pak: చివరి బంతికి గట్టెక్కిన పాక్.. బంగ్లాదేశ్‌పై విజయం.. 3–0తో క్లీన్‌స్వీప్
ఇప్పటికైతే న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించడానికి అనాసక్తిగానే ఉన్నాయి. ఆస్ట్రేలియా మాత్రం వచ్చే సంవత్సరం పాకిస్తాన్‌లో క్రికెట్ సిరీస్ ఆడేందుకు సముఖంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే 1998 తర్వాత మళ్లీ ఆసీస్ పాక్‌లో పర్యటించినట్లవుతుంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్‌లో పర్యటించేందుకు టీమిండియా ఇష్టపడడం లేదు. అయితే పాక్‌లో పర్యటించే విషయమై తాజాగా బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది చాలెంజింగ్ ఇష్యూ. కానీ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తాం. కచ్చితంగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో అన్ని దేశాలు ఆడబోతున్నాయి'' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment