ముంబై: న్యూజిలాండ్‌లో పర్యటించే భారత జట్టును నేడు (మంగళవారం) ఎంపిక చేయనున్నారు. ఈపర్యటనలో ధోని సేన జనవరి 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. జూన్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించిన అనంతరం వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత జట్టుకు సఫారీ పర్యటనలో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా ఇప్పుడే జట్టును ప్రకటిస్తారా అనే అంశంపై స్పష్టత లేదు.