
శిఖర్ ధావన్‌కు విజ్డెన్ పురస్కారం
లండన్: భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ కు ‘విజ్డెన్ మేటి క్రికెటర్ల జాబితా’లో చోటు దక్కింది. గత ఏడాది అద్భుతంగా రాణించిన ఐదుగురు క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకడు. భారత్ విజేతగా నిలిచిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తన ప్రదర్శనతో ఈ ఓపెనర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 90.75 సగటుతో 363 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెల్చుకున్నాడు.
మొత్తంగా 2013లో ధావన్ 26 వన్డేలు ఆడి 1162 పరుగులు చేశాడు. మిగిలిన నలుగురు విజ్డెన్ మేటి క్రికెటర్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రిస్ రోజర్స్, ర్యాన్ హ్యారిస్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్, ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ చార్లోటీ ఎడ్వర్డ్స్ ఉన్నారు. రోజర్స్, హ్యారిస్, రూట్‌లు యాషెస్ సిరీస్‌లో రాణించారు. ఇటీవల ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరడంలో కెప్టెన్ ఎడ్వర్డ్స్ కీలక పాత్ర పోషించింది.