
అప్పుడైనా గంభీర్ ను సెలెక్ట్ చేస్తారా?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ సోమవారం ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంతకాలం జట్టుకు దూరమైన రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్, మనీశ్‌పాండేలు ఎంపికయ్యారు.. కానీ గంభీర్ మాత్రం ఏం తప్పు చేశాడంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఐపీఎల్ ఓకే సీజన్లో 5000 పరుగులు చేస్తేనే గంభీర్ ను జట్టులోకి తీసుకుంటారనుకుంటా అని అనిశ్ షా అనే వ్యక్తి బీసీసీఐని వ్యంగ్యంగా విమర్శించాడు.
ప్రస్తుత ఐపీఎల్‌లో పరుగుల వేటను కొనసాగిస్తున్న గంభీర్ ను పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఈ క్రికెటర్ అభిమానులు మండిపడుతున్నారు. బ్రింగ్‌బ్యాక్‌గంభీర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు జట్టును ప్రకటించిన అనంతరం గంభీర్ గురించి ప్రశ్నించగా.. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా.. రహానే బ్యాకప్ ఓపెనర్‌గా ఉంటాడు అని వివరణ ఇచ్చాడు. జడేజాకు కావాలనే బ్రేక్ ఇచ్చామని, గాయం కారణంగానే అశ్విన్ ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడని చెప్పాడు. ఫామ్ లో ఉన్న గంభీర్ ను టెస్టులకు కూడా దూరం చేస్తున్నారని, క్రికెట్ లో రాజకీయాలు మానేయాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు జట్టులో ఉండేలా ఎంపిక జరిగింది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 4న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. దీంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
I guess Gautam Gambhir need to score 5000 runs in one ipl season then he will be selected @BCCI #ChampionsTrophy #BringBackGambhir #CT2017
— Anees shah (@anees_rs) 8 May 2017