
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులో ముగ్గురు సభ్యలు కరోనా బారిన పడ్డారు. శుక్రవారం(మే 20) సస్సెక్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన పరీక్షలలో ఆటగాళ్లు హెన్రీ నికోల్స్, బ్లెయిర్ టిక్నర్, బౌలింగ్ కోచ్ షేన్ జుర్గెన్‌సెన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణైంది.
దీంతో ఈ ముగ్గురు ఐదు రోజులు పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. అయితే మిగిలిన సభ్యులకు నెగెటివ్‌గా తేలడంతో.. షెడ్యూల్ ప్రకారమే నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి టెస్ట్ లార్డ్స్ వేదికగా జాన్ 2న ప్రారంభం కానుంది.
చదవండి: Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్‌కు చోటు! బ్యాకప్ ప్లేయర్‌గా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment