న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. లెప్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నికోలస్(28) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వికెట్ టు వికెట్ వేసిన బంతిని తక్కువ అంచనా వేసిన నికోలస్ బొక్క బోర్లాపడ్డాడు. బ్యాట్‌ను తప్పించుకొని నేరుగా వికెట్లను తాకింది. దీంతో షాక్‌కు గురైన నికోలస్ భారంగా క్రీజును వదిలాడు.