ప్రపంచకప్ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్(74)ను జడేజా తన స్టన్నింగ్ త్రో ఔట్ చేశాడు. బుమ్రా వేసిన 48వ ఓవర్‌లో టేలర్ డీప్ స్వ్కేర్ లెగ్ వైపు షాట్ కొట్టి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఒక పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జడేజా నేరుగా వికెట్లకు విసిరాడు. దీంతో టేలర్ రనౌట్‌గా వెనుదిరిగాడు.