అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని భారత-ఏ జట్టు రెండు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటన వెళ్లనుంది. ఈ సిరీస్‌కు భారత-ఏ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ పర్యటనకు భారత-ఏ జట్టు హెడ్‌కోచ్ వివియస్ లక్ష్మణ్ దూరమయ్యాడు.
వివియస్ లక్ష్మణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా లక్ష్మణ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతాలే కూడా న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఉన్నారు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు గుజరాత్ మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ ఆకాడమీ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌ను భారత-ఏ జట్టు హెడ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. అతడితో పాటు బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా ఈ సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కాగా నవంబర్ 29న ఇరుజట్ల మధ్య తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక రెండు మ్యాచ్‌ల అనంతరం భారత సీనియర్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది.
తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షెత్
రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ శేథ్, ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, కేఎస్ భరత్!
చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు
Comments
Please login to add a commentAdd a comment