Rishabh Pant Shares Video: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ అతడు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం ఆరంభించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా రిషభ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్‌సీఏ బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం అతడితో కేక్ కట్ చేయించాడు ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్. ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సమక్షంలో సితాంశు బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు.
హ్యాపీ బర్త్‌డే మచ్చా.. థాంక్యూ
‘‘కొంచెం బ్లర్‌గా ఉంది గానీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మచ్చా. గత కొన్ని నెలలుగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు’’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు వెళ్తున్న క్రమంలో రూర్కీ వద్ద అతడి కారుకు ప్రమాదం జరిగింది.
ఘోర ప్రమాదం నుంచి బయటపడి
ఆ సమయంలో ఒక్కడే ఉన్న పంత్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. కాస్త కోలుకున్న తర్వాత బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. నడవగలిగే స్థితికి చేరుకున్న తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏకు పంత్‌ను పంపగా.. అక్కడ పునరావాసం పొందుతున్నాడు.
కాగా ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్-2023 వంటి మెగా మ్యాచ్ మిస్ అయిన రిషభ్ పంత్ వన్డే వరల్డ్‌కప్ నాటికైనా అందుబాటులోకి వస్తే బాగుండని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment