Sitanshu Kotak
-
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్! ఎవరంటే?
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ప్రోటీస్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ సిరీస్‌కు భారత కెప్టెన్‌గా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ వ్యవహరించనుండగా, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌తో పాటు ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లు కూడా ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండకపోయినట్లు సమాచారం. అతడి స్ధానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ స్టాప్, సౌరాష్ట్ర లెజెండ్ సితాన్షు కొటాక్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అదే విధంగా భారత మాజీ వికెట్ కీపర్ అజయ్ రత్రా ఫీల్డింగ్ కోచ్‌గా, రజిబ్ దత్తా బౌలింగ్ కోచ్‌గా వన్డే సిరీస్ కోసం బాధ్యతలు చేపట్టనున్నారు. మరి ద్రవిడ్..? కాగా వన్డే సిరీస్ అనంతరం టీమిండియా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకుంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా జట్టుతో కలిశారు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు భారత్ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సారి ఎలాగైనా సఫారీలను ఓడించి చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలోనే ద్రవిడ్‌తో కూడిన కోచింగ్ బృందం దగ్గరుండి భారత జట్టు సన్నాహాకాలను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. టెస్టు సిరీస్ కంటే ముందు వార్మాప్ మ్యాచ్‌ల్లో భారత తలపడనుంది. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్షిష్లో భాగంగా జరగుతున్న టెస్టు సిరీస్ కాబట్టి ద్రవిడ్ ప్రత్యేకంగా దృష్టిసారించాడు. ఈ నేపథ్యంలోనే వన్డేలకు దూరంగా ఉండాలని మిస్టర్ డిఫెండ్బుల్ నిర్ణయించుకున్నాడు. -
హ్యాపీ బర్త్‌డే మచ్చా.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు: పంత్ భావోద్వేగం
Rishabh Pant Shares Video: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ అతడు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రిషభ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్సీఏ బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం అతడితో కేక్ కట్ చేయించాడు ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్. ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సమక్షంలో సితాంశు బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే మచ్చా.. థాంక్యూ ‘‘కొంచెం బ్లర్‌గా ఉంది గానీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మచ్చా. గత కొన్ని నెలలుగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు’’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు వెళ్తున్న క్రమంలో రూర్కీ వద్ద అతడి కారుకు ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం నుంచి బయటపడి ఆ సమయంలో ఒక్కడే ఉన్న పంత్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. కాస్త కోలుకున్న తర్వాత బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. నడవగలిగే స్థితికి చేరుకున్న తర్వాత బెంగళూరులోని ఎన్సీఏకు పంత్‌ను పంపగా.. అక్కడ పునరావాసం పొందుతున్నాడు. కాగా ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్-2023 వంటి మెగా మ్యాచ్ మిస్ అయిన రిషభ్ పంత్ వన్డే వరల్డ్‌కప్ నాటికైనా అందుబాటులోకి వస్తే బాగుండని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
'అతనికి ఏ కలర్ బంతైనా ఒక్కటే'
గ్రేటర్ నోయిడా: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భాగంగా ఇక్కడ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రవీంద్ర జడేజాపై సౌరాష్ట్ర కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా భారత్‌లో ఉన్న స్పిన్ ట్రాక్‌ల్లో అతనే అత్యుత్తమ ఎడమచేతి స్పిన్నర్ అని సితాన్షు కొనియాడాడు. పింక్ బాల్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో జడేజాకు ఎటువంటి సమస్య ఎదురుకాలేదన్నాడు. గతేడాది జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో జడేజా 37 వికెట్లు తీసి సౌరాష్ట్ర విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన సంగతిని సితాన్షు గుర్తు చేశాడు. ఒక ఎడమచేతి స్పెషలిస్టు స్పిన్నర్ ఎలా బౌలింగ్ చేస్తాడో అదే తరహాలో జడేజా బౌలింగ్ శైలి ఉంటుందన్నాడు. బంతిని పూర్తిగా చేతిలో అదిమిపట్టడం ఒకటైతే, బంతిని చాలా కిందిస్థాయి నుంచి స్పిన్ చేయడం జడేజా వికెట్లు సాధించడానికి ఉపయోగపడుతుందన్నాడు. త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్‌లో జడేజా ముఖ్య భూమిక పోషించడం ఖాయమని జోస్యం చెప్పాడు. కేన్ విలియమ్సన్ గ్యాంగ్‌కు జడేజా నుంచి ముప్పు పొంచి ఉందని సితాన్షు హెచ్చరించాడు.