కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాతో డేనైట్ టెస్టులను ఆడించే పనిలో పడ్డాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ డేనైట్ టెస్టులు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని దాదా చెప్పాడు. గురువారం తమ భేటీలో ఈ అంశం చర్చకు వచి్చందని అన్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ డేనైట్ టెస్టులతో ప్రేక్షకాదరణ పెరుగుతుందని అన్నాడు.
భారత క్రికెట్‌ను మరో దశకు తీసుకెళ్లేందుకు లక్ష్మణ్, అజహరుద్దీన్, సచిన్, ద్రవిడ్, కపిల్‌దేవ్, గావస్కర్‌ల సేవలి్న, సూచనల్ని స్వీకరిస్తామని చెప్పాడు. ‘డేనైట్ టెస్టులు ప్రాచుర్యం పొందుతాయని నేను బలంగా విశ్వసిస్తున్నా. ఎప్పుడు జరుగుతాయో చెప్పలేను కానీ... నా ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరిగేందుకు కృషిచేస్తా’నని అన్నాడు. ఏదేమైనా సౌరవ్ వచ్చే జూలైలో ని్రష్కమించే సమయానికి భారత్‌లో డేనైట్ టెస్టులు జరిగే అవకాశం లేదు.
ఈ సీజన్‌లో స్వదేశంలో బంగ్లాతో జరిగే టెస్టు సిరీసే ఆఖరి సిరీస్. టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడే గంగూలీ దులీప్ ట్రోఫీని డేనైట్ మ్యాచ్‌లుగా పింక్ బాల్‌తో నిర్వహించాలని సిఫార్సు చేశాడు. కానీ దేశవాళీ బౌలర్ల అభ్యంతరంతో అది కార్యరూపం దాల్చలేదు. గత మూడేళ్లుగా భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని ‘దాదా’ అన్నాడు. ప్రపంచంలోనే ఐపీఎల్ ప్రముఖ లీగ్‌గా ఘనతకెక్కిందని పేర్కొన్నాడు.
ఎన్‌సీఏకు ప్రాధాన్యత ఇవ్వాలని...
క్యాబ్ ప్రాజెక్ట్ ‘విజన్ 2020’ సలహాదారుడైన వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘భారత్ ఇంతలా రాణించేందుకు ప్రధాన కారణం రిజర్వ్ బెంచే. ఈ నేపథ్యంలో ‘దాదా’ ఇప్పుడు ఎన్‌సీఏకు మరింత ప్రాధాన్యమిస్తాడని ఆశిస్తున్నా. 1999–2000 సీజన్‌లో భారత్... ఆసీస్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో గంగూలీ జట్టులో ఆశావహ దృక్పథాన్ని పెంచాడు. కుర్రాళ్లు రాణించేందుకు ప్రేరణగా నిలిచాడు. ఇప్పుడు బోర్డు పరిపాలకుడిగా కూడా అతను విజయవంతం అవుతాడు’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో వీవీఎస్‌తో పాటు మాజీ కెపె్టన్, ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ హాజరయ్యాడు. అజ్జూ మాట్లాడుతూ ‘గంగూలీ బోర్డు అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉంది. అతని సారథ్యంలో భారత్ ఎన్నో టోరీ్నలు గెలిచింది. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి బోర్డును కూడా సమర్థంగా నడిపిస్తాడు’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment