
India tour of Zimbabwe, 2022- న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని నిర్ధారించారు. జింబాబ్వే సిరీస్‌కు, ఆసియా కప్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉండటమే అందుకు కారణం. ‘టీమిండియాకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వేకు వెళతారు.
హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విరామమేమీ తీసుకోవడం లేదు. అయితే జింబాబ్వేతో చివరి వన్డే ఈ నెల 22న ఉంటే ఆసియా కప్ కోసం భారత జట్టు ఈ నెల 23న యూఏఈలో ఉండాలి. ఆసియా కప్ వెళ్లే జట్టుతో రాహుల్ ద్రవిడ్ వెళతాడు. అందుకే ఈ తాత్కాలిక ఏర్పాటు’ అని జై షా స్పష్టం చేశారు.
రెండు టీమ్‌లలోనూ ఉన్న ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, దీపక్ హుడా హరారే నుంచి నేరుగా దుబాయ్ వెళతారు. కొన్నాళ్ల క్రితం ఇదే తరహాలో ఐర్లాండ్‌కు వెళ్లిన భారత జట్టుకు కూడా లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా ఆగష్టు 18న జింబాబ్వేతో మొదలు కానున్న సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
చదవండి: IND vs PAK: అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్
Rohit Sharma: రోహిత్ శర్మ సాధించిన ఈ 3 రికార్డులు బద్దలు కొట్టడం కోహ్లికి సాధ్యం కాకపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment