బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు కచ్చితంగా ఫైనల్‌కు చేరుతుందని అంటున్నాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా తుది పోరుకు అర్హత సాధిస్తుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నాడు. ఈ మెగా టోర్నీలో భారత సక్సెస్ వెనుక బౌలింగ్ యూనిట్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నాడు. భారత్ బౌలింగ్ బలంగా ఉన్న కారణంగానే స్వల్ప లక్ష్యాలను సైతం కాపాడుకుని విజయాలు నమోదు చేయడం శుభ పరిణామని లక్ష్మణ్ అన్నాడు.
పేస్ బౌలింగ్ ఎటాక్‌లో బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లు కీలక పాత్ర పోషిస్తుంటే, స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, చహల్‌లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మిడిల్ ఆర్డర్‌లో కాస్త వైఫల్యం కనబడుతుందన్నాడు. ఎంఎస్ ధోని అసాదారణ ఆటగాడని కొనియాడుతూనే.. స్టైక్ రోటేట్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో ఎవరు ఫైనల్‌కు చేరతారనే ప్రశ్నకు సంబంధించి లక్ష్మణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరతాయని జోస్యం చెప్పాడు. తన వరకూ ఫైనల్ పరంగా చూస్తే 2003 వరల్డ్‌కప్ పునరావృతం అవుతుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment