VVS Laxman to Replace Rahul Dravid as Next NCA Head Says Reports - Sakshi
Sakshi News home page

VVS Laxman: ఎన్‌సీఏ డైరెక్ట‌ర్‌గా వీవీఎస్‌ ల‌క్ష్మ‌ణ్..!

Published Sat, Nov 6 2021 5:10 PM | Last Updated on Sat, Nov 6 2021 5:31 PM

VVS Laxman To Replace Rahul Dravid As Next NCA Head Says Reports - Sakshi

VVS Laxman To Replace Rahul Dravid As Next NCA Head: నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(ఎన్‌సీఏ) డైరెక్ట‌ర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌, హైద‌రాబాదీ స్ట‌యిలిష్ ప్లేయర్‌ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్ ద్రవిడ్‌.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆ స్థానాన్ని లక్షణ్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు లక్షణ్‌ను ఒప్పించేందుకు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జై షాలే నేరుగా రంగప్రవేశం​ చేశారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మణ్‌ ఎన్‌సీఏ హెడ్‌ పదవిని చేపట్టేందుకు అంగీక‌రిస్తే, భార‌త క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా ఉండ‌ద‌ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ సమాధానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, భారత క్రికెట్ మ‌రింత వైభ‌వాన్ని సంత‌రించుకోవాలంటే.. మాజీలు త‌మ అనుభ‌వాల్ని పంచుకోవాల్సి ఉంటుంద‌ని బీసీసీఐ బాస్‌ ఇటీవ‌లే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 
చదవండి: మైఖేల్‌ వాన్‌పై నిషేధం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement