చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత పురుష, మహిళ క్రికెట్ జట్లు తొలిసారి పాల్గోనున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8 హాంగ్జౌలో జరగనున్నాయి. కాగా ఈవెంట్ కోసం భారత పురుషల ద్వితీయ శ్రేణి జట్టును బీసీసఘై ఎంపిక చేసింది.
ఆక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో.. ఆసియాకప్‌లో యువ భారత జట్టు పాల్గొనుంది. ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు యశస్వీ జైశ్వాల్,రింకూ సింగ్, జితేష్ శర్మకు చోటు దక్కింది. ఇక ఈవెంట్‌లో భారత పురుషల జట్టు కెప్టెన్‌గా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. మహిళల జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడపించనుంది.
హెడ్ కోచ్‌లుగా వీవీఎస్ లక్ష్మణ్, హృషికేష్ కనిట్కర్
కాగా ఈ ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ రెస్టు ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ప్రస్తుతం ఆసియాకప్-2023 కోసం ఆలూర్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో భారత ఆటగాళ్లతో పాటు ఉన్నాడు. ఇక లక్ష్మణ్‌తో పాటు చైనాకు సాయిరాజ్ బహుతులే(బౌలింగ్‌కోచ్),మునీష్ బాలి (ఫీల్డింగ్ కోచ్) కూడా వెళ్లనున్నారు.
లక్ష్మణ్‌తో పాటు, ఆసియాడ్ కోసం భారత పురుషుల జట్టు సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే మరియు ఫీల్డింగ్ కోచ్‌గా మునీష్ బాలి ఉన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్‌లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. లక్ష్మణ్ పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. మరోవైపు ఈ ఆసియాటోర్నీలో భారత మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఆటగాడు హృషికేష్ కనిట్కర్ వ్యవహరించనున్నాడు. కాగా గత డిసెంబర్ నుంచి భారత మహిళల జట్టు రెగ్యూలర్ హెడ్‌కోచ్ లేకుండానే ఆడుతోంది.
చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment