
నార్తాంప్టన్: ఇంగ్లండ్ వుమెన్ క్రికెట్ టీంతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హర్లిన్ డియోల్ అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకుంది. పందొమ్మిదవ ఓవర్‌లో భారత బౌలర్ శిఖా పాండే, జోన్స్‌కు బంతిని సంధించగా.. ఆమె షాట్ ఆడింది. దీంతో గాల్లోకి లేచిన బంతి బౌండరీ మీదుగా దూసుకుపోతుండగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హర్లిన్ పాదరసంలా కదిలి బాల్‌ను ఒడిసిపట్టింది. అయితే, బ్యాలెన్స్ చేసుకోవడం కష్ట కావడంతో.. వెంటనే అప్రమత్తమై ఆమె.. బంతిని గాల్లోకి విసిరి.. మళ్లీ బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టింది.
ఇక సూపర్బ్ రివర్స్ కప్‌డ్ క్యాచ్‌కు సంబంధించిన ఈ వీడియోను ఈసీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ సాధించిన ఈ వీడియోను రీట్వీట్ చేసిన టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్... ‘‘క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి గుడ్ క్యాచ్‌ను మనం ఎప్పటికీ చూడలేం. హర్లిన్ డియోల్ ఫీల్డింగ్.. నిజంగా టాప్ క్లాస్’’ అంటూ హర్లిన్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి టీ20కి వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో డీఎల్‌ఎస్ విధానం ప్రకారం ఇంగ్లండ్ మహిళా జట్టు భారత్‌పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ స్కోర్లు:
►ఇంగ్లండ్ మహిళా జట్టు- 177/7 (20 ఓవర్లలో)
►భారత మహిళా జట్టు- 54/3 (8.4 ఓవర్లలో)
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- నటాలీ సీవర్
As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021
Comments
Please login to add a commentAdd a comment