
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రధాన కోచ్ ద్రవిడ్ టెస్టు జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్లనుండటంతో తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించారు.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ఆడిన తర్వాత జూన్ 19న భారత్ ఐర్లాండ్‌కు పయనమవుతుంది. అక్కడ జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది.
చదవండి: Rashid Khan: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? చక్కగా నిద్రపో!