teamindia coach
-
Asia Cup 2022: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
ముంబై: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు మరో సిరీస్ బాధ్యతలు అప్పజెప్పారు. ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో పాల్గొనే టీమిండియా తాత్కాలిక కోచ్‌గా నియమించారు. రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా సోకడంతో ఇక్కడే ఉండిపోయారు. దీంతో ఇటీవల జింబాబ్వేలో కోచ్ పాత్రను విజయవంతంగా పోషించిన లక్ష్మణ్‌కు ఆసియా కప్ బాధ్యతలు అప్పగించారు. మరింత సమయం లేకపోవడంతో ఆయన హరారే (జింబాబ్వే) నుంచి నేరుగా దుబాయ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన వీసా ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. అందువల్లే లక్ష్మణ్ బుధవారం జట్టుతో కలిసేందుకు మార్గం సుగమమైందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు తెలిపాయి. మరోవైపు బోర్డు వైద్యబృందం ద్రవిడ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, వైరస్ నుంచి బయటపడగానే యూఏఈకి వెళ్లే అకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్షంగా జట్టుతో లేకపోయినప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్రవిడ్... ఇన్చార్జ్ కోచ్ లక్ష్మణ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లకు అందుబాటులో ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రం టీమిండియా ప్రాక్లీస్ సెషన్లో పాల్గొంది. ఆసియా కప్‌కు భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ చదవండి: NZ-A vs IND-A: న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత జట్టులోకి హైదరాబాద్ ఆటగాడు! -
టీమిండియా టి20 తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రధాన కోచ్ ద్రవిడ్ టెస్టు జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్లనుండటంతో తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ఆడిన తర్వాత జూన్ 19న భారత్ ఐర్లాండ్‌కు పయనమవుతుంది. అక్కడ జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. చదవండి: Rashid Khan: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? చక్కగా నిద్రపో! -
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంపికైనట్లు బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. స్వదేశంలో నవంబర్ 17న ప్రారంభంకానున్న న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రవిడ్ బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. 🚨 NEWS 🚨: Mr Rahul Dravid appointed as Head Coach - Team India (Senior Men) More Details 🔽 — BCCI (@BCCI) November 3, 2021 టీ20 ప్రపంచకప్-2021 తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నియామకం చేపట్టింది. రవిశాస్త్రి టీమిండియాకు అందించిన సేవలకు గాను బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, రవిశాస్త్రి హయాంలో టీమిండియా టెస్ట్ నంబర్ జట్టుగా, డబ్ల్యూటిసీ ఫైనలిస్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2021: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. -
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం
BCCI Invites Applications For Team India Head Coach Position: భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలు అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26 ఆఖరి తేదీ కాగా, ఇతర పదవులకు నవంబర్ 3 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ సారథి రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే పేర్లు దాదాపుగా ఖారారైన నేపథ్యంలో కేవలం ఫార్మాలిటీ కోసం ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. చదవండి: Sania Mirza : భారత్-పాక్ మ్యాచ్ రోజు ఎవరికీ కనిపించకుండా మాయమైపోతాను.. -
టీమిండియా తదుపరి కోచ్ అతడేనా?
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనుండటంతో అతని వారసుడు ఎవరనే అంశంపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఈ విషయమై తాజాగా ఓ క్లారిటీ వచ్చినట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న విక్రమ్ రాథోడ్.. తదుపరి చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా బీసీసీఐ పెద్దలు సైతం రాథోడ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా టీమిండియా కోచ్ పదవి రేసులో రాహుల్ ద్రవిడ్ ముందున్నాడనే వార్తలు వినిపించినా.. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కే పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో రాథోడ్‌కు లైన్ క్లియర్ అయినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మతోనూ రాథోడ్ సత్సంబంధాలు కలిగి ఉండటం అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది. మరోవైపు కోచ్ పదవి రేసులో రాథోడ్ సహా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. ఏదిఏమైనప్పటికీ.. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే దాకా టీమిండియా హెడ్ కోచ్ పదవిపై సస్పెన్స్ కొనసాగనుంది. చదవండి: లార్డ్స్ టెస్ట్ మాకో గుణపాఠం.. ఇకపై వివాదాల జోలికి వెళ్లం: రూట్ -
Rahul Dravid: ఎన్సీఏ డైరెక్టరా లేక టీమిండియా కోచ్ పదవా..?
ముంబై: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను చివరి తేదీగా ప్రకటించింది. ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మరోసారి ఈ పదవికి దరఖాస్తు చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్సీఏ డైరెక్టర్‌గా ద్రవిడ్ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమే. ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ధవన్ సేనకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ పరిమిత ఓవర్ల పర్యటనలో ద్రవిడ్ ప్రభావం నామమాత్రమే అయినా.. అతన్ని భవిష్యత్తు టీమిండియా హెడ్ కోచ్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. రవిశాస్త్రి పదవీకాలాన్ని బీసీసీఐ పొడించడం దాదాపు అసాధ్యమే. ఈ నేపథ్యంలో ఎన్సీఏగా డైరెక్టర్‌గా, భారత్-ఏ, అండర్-23, అండర్-19, అండర్-16 జట్ల కోచ్‌గా పని చేసిన అనుభవమున్న ద్రవిడ్ వైపు బోర్డు మొగ్గు చూపే అవకాశం ఉంది. ది వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకోవడం, ఇండియా రిజర్వ్ బెంచ్‌ను బలంగా తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించడం ద్రవిడ్‌కు కలిసొచ్చే అంశాలు. అందులోనూ ద్రవిడ్ సహచరుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు స్పష్టమవుతోంది. -
రవిశాస్త్రి బాగానే పనిచేస్తున్నప్పుడు ద్రవిడ్ ప్రస్తావన ఎందుకు..?
ముంబై: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిని బాధ్యున్ని చేస్తూ.. అతనిపై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ అతనికి మద్దతు పలికాడు. కోచ్ బాధ్యతలను రవిశాస్త్రి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నప్పుడు అతన్ని తొలగించాలని డిమాండ్ చేయడంలో అర్ధం లేదన్నాడు. రాహుల్ ద్రవిడ్ రూపంలో కొత్త కోచ్‌ను తయారు చేసుకోవడంలో తప్పేమీలేదు కానీ, కోచ్ మార్పు విషయమై అనవసర చర్చల వల్ల జట్టు ప్రదరన్శ లయ తప్పుతుందని అభిప్రాయపడ్డాడు. మూడు సంవత్సరాల పాటు కోచ్‌గా రవిశాస్త్రి బాగానే పని చేశాడని, ఇప్పుడు అనసరంగా ద్రవిడ్ ప్రస్తావన తెచ్చి కొత్త సమస్యలకు తెరలేపొద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు. రవిశాస్త్రి మంచి పనితీరు కొనసాగిస్తుంటే.. అతన్ని తొలగించాల్సిన అవసరం లేదని, ఈ చర్చ ఆటగాళ్లతో పాటు, ఇరు జట్ల కోచ్‌లపై అనవసరమైన ఒత్తిడి కలిగిస్తుంది అని కపిల్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంపై ప్రశంసల వర్షం కురిపించాడు. రెండు వేర్వేరు జట్లను పంపించే అరుదైన అవకాశం బీసీసీఐకి కలిగిందంటే, ఆ ఘనత టీమిండియా రిజర్వ్ బెంచ్‌కే దక్కుతుందన్నాడు. భారత రెండు జట్లు ఇంగ్లండ్, శ్రీలంకల్లో విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, కోహ్లీ నేతృత్వంలో భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే ధవన్ సారధ్యంలో మరో జట్టు శ్రీలంకకు వెళ్లింది. ఈ జట్టుకు ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించడంతో కోచ్ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. దీంతో అతని తర్వాత కోచ్ రేసులో ద్రవిడ్ ఉన్నాడని బీసీసీఐ పరోక్ష సంకేతాలు పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ అతనే..
ముంబై: గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా తొలిసారి రెండు దేశాల్లో వేర్వేరు జట్లతో తలపడుతుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ కెప్టెన్సీలో యువ భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ లంకకు వెళ్లిన బృందానికి కోచ్‌గా నియమించబడ్డాడు. ఇదిలా ఉంటే, రెగ్యులర్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనున్న నేపథ్యంలో అతని తర్వాత కోచ్ ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ రేసులో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అందరి కంటే ముందు ఉంటాడని భారత మాజీ ఆల్‌రౌండర్ రితేందర్ సింగ్ సోధి జోస్యం చెప్పాడు. ఎన్సీఏ డైరెక్టర్‌గా, అండర్-19 కోచ్‌గా మంచి సక్సెస్ రేట్ కలిగిన ద్రవిడ్‌కే కోచ్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీలంక పర్యటన నిమిత్తం ద్రవిడ్‌ను కోచ్‌గా పంపించడంలో బీసీసీఐ ఉద్దేశం క్లియర్‌గా ఉందని, దీంతో రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌కు గ్రీన్ సిగ్నల్ అందినట్టేనని పేర్కొన్నాడు. వాస్తవానికి రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే సత్తా కేవలం ద్రవిడ్‌కే ఉందని తెలిపాడు. మరోవైపు రవిశాస్త్రి టీమిండియా కోచ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాడని కొనియాడాడు. కాగా, సోధి భారత్ తరఫున 18 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. -
‘కోచ్ అవాక్కయ్యాడు.. తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరా’
ముంబై: 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించిన ప్యాడీ అప్టాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. తాను రచించిన పుస్తకం 'ద బేర్‌ఫుట్ కోచ్'లో ఈ షాకింగ్ విషయాలను ప్రస్తావించాడు. భారత్‌ను రెండోసారి విశ్వ విజేతగా నిలిపిన ఆ ప్రపంచకప్‌లోని మ్యాచ్‌లకు ముందు టీమిండియా ఆటగాళ్లను సెక్స్ చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నాడు. అయితే తాను ఇచ్చిన ఈ సలహాకు నాటి హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అవాక్కయ్యాడని తెలిపాడు. ఆతర్వాత తన సలహా సరైంది కాదని భావించి క్షమాపణలు కోరినట్లు ప్యాడీ అప్టాన్ ప్రస్తావించాడు. అంతకుముందు 2009 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా తాను ప్లేయర్స్ కోసం నోట్స్ సిద్ధం చేశానని, అందులో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా రాశానని దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మానసిక నిపుణుడు చెప్పాడు. కాగా, గేమ్‌కు ముందు సెక్స్ చేయడం వల్ల ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయగలరా అంటే కచ్చితంగా అవుననే అంటున్నాడు అప్టాన్. దీంతో పాటు రాహుల్ ద్రవిడ్‌ను శ్రీశాంత్ తిట్టడం, ధోనీ కెప్టెన్సీపై నాటి జట్టులో భిన్నాభిప్రాయాలు తదితర ఆసక్తికర అంశాలను ఆయన తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఇదిలా ఉంటే, నాటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్.. ప్యాడీ అప్టాన్ను పట్టుపట్టి మరీ మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా అపాయింట్ చేసుకున్నాడు. వీరిద్దరు కోచ్‌లుగా వ్యవహరిస్తుండగా ధోనీ హయాంలో టీమిండియా 28 ఏళ్ల తర్వాత రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. నాటి ప్రపంచకప్‌లో టీమిండియా కేవలం ఒక్క మ్యాచ్‌లో(దక్షిణాఫ్రికా) మాత్రమే ఓటమి చవిచూసింది. లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం క్వార్టర్స్‌లో నాటి డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌కు షాక్ ఇచ్చిన ధోని సేన.. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్ధి పాక్‌కు మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. తర్వాత తుది పోరులో పట్టిష్టమైన శ్రీలంకకు షాకిచ్చి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. -
మాట మార్చిన ద్రవిడ్.. అప్పుడు అందరికీ అవకాశం అన్నాడు, ఇప్పుడేమో..!
ముంబై: జులై 13 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నిమిత్తం భారత బి జట్టు హెడ్ కోచ్‌గా నియమించబడిన భారత దిగ్గజ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్.. రోజుల వ్యవధిలో మాటమార్చాడు. తాను అండర్ 19 జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో జట్టుకు ఎంపికైన ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించానని, రాబోయే శ్రీలంక పర్యటనలో కూడా ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడేమో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడదని అంటున్నాడు. జట్టుకు ఎంపికై బెంచ్‌కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని చెప్పిన ఆయన..ఇప్పుడా మాటను దాట వేసినట్లుగా మాట్లాడాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల(మూడు వన్డేలు, మూడు టీ20లు) లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు. తుది జట్టు ఎంపిక సెలక్టర్లు, మేనేజ్మెంట్ పరిధిలోని విషయమని, తమకు కావాల్సిన జట్టును వారు ఎంపిక చేసుకుంటారని ఆయన వివరించాడు. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారని, అయితే వారు సిరీస్ గెలవడాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ బెర్తు కోసం అందరూ పోటీపడవచ్చంటూనే, అవకాశం వచ్చిన వాళ్లు ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. కాగా, శ్రీలంక పర్యటనలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ భారత్.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను.. -
లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను..
న్యూఢిల్లీ: ఓ సిరీస్‌కు ఎంపికై ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైతే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని టీమిండియా దిగ్గజ క్రికెటర్, భారత బి జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. చిన్నప్పుడు తనకు అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయని, అందుకే తాను భారత్-ఏ, అండర్-19 కోచ్‌గా వ్యవహరించినప్పుడు అందరికీ అవకాశాలు ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నాడు. గతంలో తాను పాటించిన సిద్ధాంతాన్నే రాబోయే శ్రీలంక పర్యటనలోనూ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కాగా, వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించే భారత బి జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో ద్రవిడ్ మాట్లాడుతూ.. గతంలో తాను కోచ్‌గా పని చేసిన కాలంలో యువ ఆటగాళ్లకు సమాన అవకాశాలు కల్పించేవాడినని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లందరికీ ముందే చెప్పేవాడినని, ఇలా చేయడం వల్ల సత్ఫలితాలు కూడా రాబట్టానని చెప్పుకొచ్చాడు. జాతీయ జట్టులో స్థానం దక్కినప్పుడు యువ ఆటగాళ్లు తెగ సంబర పడిపోతారని, అలాంటప్పుడు వారికి నిరూపించుకునే అవకాశం రాకపోతే అంతే కుమిలి పోతారని అన్నాడు. అందుకే తాను అండర్-19 జట్టులో ప్రతి మ్యాచ్‌కు ఐదారు మార్పులు చేసేవాడినని వెల్లడించాడు. కాగా, శ్రీలంక పర్యటనలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ భారత్.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా.. -
టీమిండియా కోచ్‌గా ద్రవిడ్, కెప్టెన్‌గా ధవన్..?
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా ఎంపికైనట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. జూలైలో శ్రీలంకలో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బీసీసీఐ ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా పనిచేయడం ఇది తొలిసారేమీ కాదు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో అతను భారత బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న లండన్‌కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో తొలుత(జూన్ 18-22) న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న భారత్.. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ మధ్య వచ్చే గ్యాప్‌లో బీసీసీఐ ఓ పరిమిత ఓవర్ల సిరీస్‌ను ప్లాన్ చేసింది. అక్టోబర్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. ఇందుకోసం వైట్ బాల్ స్పెషలిస్ట్‌లతో పాటు ఐపీఎల్లో సత్తా చాటిన యువ క్రికెటర్లతో కూడిన భారత బి జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలతో పాటు వీలైనన్ని టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. లంకలో పర్యటించనున్న భారత బి జట్టుకు శిఖర్ ధవన్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. జట్టు సభ్యులుగా పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు ఉండే అవకాశం ఉంది. చదవండి: టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపిన సోనూ సూద్.. -
టీమిండియా తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి
ముంబై: భారత క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి నియమితులయ్యారు. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియాకు ఆయన కోచ్ గా వ్యవహరిస్తారని బీసీసీఐ తెలిపింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలతో కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ గా ఆర్. శ్రీధర్ లను బీసీసీఐ నియమించింది. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత టీమిండియాకు పూర్తిస్థాయి కోచ్ ను నియమించింది.