ముంబై: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు మరో సిరీస్ బాధ్యతలు అప్పజెప్పారు. ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియా తాత్కాలిక కోచ్‌గా నియమించారు. రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా సోకడంతో ఇక్కడే ఉండిపోయారు. దీంతో ఇటీవల జింబాబ్వేలో కోచ్ పాత్రను విజయవంతంగా పోషించిన లక్ష్మణ్‌కు ఆసియా కప్ బాధ్యతలు అప్పగించారు.
మరింత సమయం లేకపోవడంతో ఆయన హరారే (జింబాబ్వే) నుంచి నేరుగా దుబాయ్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన వీసా ప్రక్రియను బోర్డు పూర్తి చేసింది. అందువల్లే లక్ష్మణ్ బుధవారం జట్టుతో కలిసేందుకు మార్గం సుగమమైందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు తెలిపాయి. మరోవైపు బోర్డు వైద్యబృందం ద్రవిడ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, వైరస్ నుంచి బయటపడగానే యూఏఈకి వెళ్లే అకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యక్షంగా జట్టుతో లేకపోయినప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్రవిడ్... ఇన్‌చార్జ్ కోచ్ లక్ష్మణ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లకు అందుబాటులో ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రం టీమిండియా ప్రాక్లీస్ సెషన్‌లో పాల్గొంది.
ఆసియా కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్
స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్
చదవండి: NZ-A vs IND-A: న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత జట్టులోకి హైదరాబాద్ ఆటగాడు!
Comments
Please login to add a commentAdd a comment