
హైదరాబాద్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపాల్ని స్పిన్నర్లు పసిగట్టడం వల్లే అతను తరుచు స్పిన్ బౌలింగ్‌కు చిక్కుతున్నాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఆ జట్టు కెప్టెన్ రెండుసార్లు స్పిన్నర్లకు ఔట్ కావడాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. అందుకు కారణం విరాట్ బ్యాటింగ్ టెక్నిక్‌ను స్పిన్నర్లు దొరకబుచ్చుకోవడమేనని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి: అమ్మా.. ధోనికే మన్కడింగా?)
ఇలా స్పిన్నర్లకు కోహ్లి పదే పదే ఔట్ కావడం తొలిసారి కాదని, గతంలో కూడా చాలాసార్లు స్పిన్ బౌలింగ్‌లోనే అతను ఔట్ కావడాన్ని చూశామన్నాడు. ప్రధానంగా స్పిన్నర్ల నుంచి వచ‍్చే గుగ్లీలకు కోహ్లి ఔట్ అవుతున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్న లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ‘గతేడాది ముజీబ్ ఉర్ రహ్మాన్, ఆడమ్ జంపా, మయాంక్ మార్కండేలకు విరాట్ కోహ్లి ఔటయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో కూడా కోహ్లి రెండు సందర్భాల్లో స్పిన్‌కు చిక్కాడు. అందులో కోహ్లిని రాజస్తాన్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ ఔట్ చేసిన విధానం అద్వితీయం. దీనిపై విరాట్ కోహ్లి సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది. కోహ్లి కచ్చితంగా అసాధారణ ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ స్పిన్ బౌలింగ్‌లో కోహ్లి వికెట్ సమర్పించుకోవడం అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపమే. దీన్ని కోహ్లి అధిగమిస్తాడనే అనుకుంటున్నా’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.