ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం భారత్-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో ఓ భావోద్వేగపు సన్నివేశం చోటుచేసుకుంది. అసాంతం అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్‌పై అభిమానులకు ఉన్న ప్రేమ ఏంటో ప్రతిబింబించింది. ఇటీవలె హాంకాంగ్‌తో మ్యాచ్ సందర్భంగా ఓ పిల్లోడు తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోని ఔటయ్యాడని.. ఏడుస్తూ మారం చేయడం మనమంతా చూశాం. అచ్చు అలాంటి సీన్ నిన్నటి మ్యాచ్‌లోనూ రిపీట్ అయింది. దాదాపు భారత్ గెలుపు కాయమనుకున్న తరుణంలో జడేజా ఔటవ్వడం.. మ్యాచ్ టై కావడం ఓ సిక్కు పిల్లాడు తట్టుకోలేకపోయాడు.ఓవైపు మైదానంలో అఫ్గాన్ ఆటగాళ్లు గెలిచామనే సంతోషంతో సంబురాలు చేసుకుంటుంటే.. మరోవైపు గ్యాలరీలో ఈ చిన్నోడు మాత్రం కళ్లలోంచి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోలేక బోరుమన్నాడు. పక్కనే ఉన్న తన తండ్రి ఎంత ఓదార్చిన ఆ చిన్నోడు మాత్రం తన బాధను ఆపుకోలేకపోయాడు.
మ్యాచ్ టై అయిందని..తండ్రి ఎంత ఓదార్చిన!
Published Wed, Sep 26 2018 5:45 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement