హర్భజన్‌కు షాకిస్తున్న ఫ్యాన్స్‌! | Harbajan Singh Shares Simple Exercise Video on Twitter | Sakshi
Sakshi News home page

వీడియో షేర్‌ చేసిన హర్భజన్‌.. షాకిస్తున్న ఫ్యాన్స్‌!

Published Sat, Jun 20 2020 2:18 PM | Last Updated on Sat, Jun 20 2020 3:13 PM

Harbajan Singh Shares Simple Exercise Video on Twitter - Sakshi

ముంబై: కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన తమ అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా ఎ‍ప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ స్టార్స్‌ తమకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందటానికి రోగ నిరధక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి అనే విషయాలను కూడా వారి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తన ఫ్యాన్స్‌ కోసం ‘సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌‌’ అని ఒక​ వీడియోని తన ట్విటర్‌ అకౌంట్‌లో శనివారం పోస్ట్‌ చేశాడు.
(దాదా ఇంట మరోసారి కరోనా కలకలం)

ఈ వీడియోలో ఒక వ్యక్తి చాలా కష్టమైన కొన్ని డాన్స్‌‌ స్టెప్పులను వేశాడు. వాటిని చాలా మంది గుంపు ముందు చేసి చూపించాడు. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన భజ్జి కరోనా టైంలో ఇంట్లో ఉండి ఎక్సర్‌సైజ్‌లు చేయాలనుకుంటున్నారా?, ఈ 20 సెకన్లు ఉండే ఎక్సర్‌సైజ్‌ను చేస్తూ ఫిట్‌గా ఉండండి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి అని పోస్ట్‌ చేశాడు. దీనిపై అతడికి అభిమానులు చురకలు అంటించారు. భజ్జీ నువ్వు ఒకసారి డెమో చేసి చూపించవా అని ఒకరు కోరారు. మరో అభిమాని మీరు ఇది ఫస్ట్‌ ట్రై చేసి ఆ వీడియో ఎందుకు పెట్టకూడదు అని కామెంట్‌ చేశాడు. (‘ఆ విషయంలో జడేజాను మించినోడు లేడు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement